English | Telugu

Jayam serial: హాస్పిటల్ లో గంగ వాళ్ళ అమ్మ.. రుద్ర సాయం చేస్తాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -23 లో......పెద్దసారు సూపర్ మార్కెట్ కి వస్తాడు. ఎవరిని చూసిన గంగ వచ్చిందనే భ్రమ పడుతుంటాడు. అప్పుడే గంగ వస్తుంది కానీ తన ఉహ అనుకుంటాడు. గంగ గిల్లి చూడగా నిజంగానే వచ్చిందని పెద్దసారు అనుకుంటాడు. నువ్వు ఇక రావేమో అనుకున్నాను కానీ వచ్చినందుకు సంతోషమని గంగతో పెద్దసారు అంటాడు.

మళ్ళీ మీ నాన్న వచ్చి గొడవ ఏం చెయ్యడు కదా అని పెద్దసారు అనగానే చెయ్యడు అని గంగ అంటుంది. కానీ నన్ను ఇక్కడ చూస్తే రుద్ర సర్ ఏమంటాడో అని గంగ అంటుంది. రుద్ర ఎదురుగా నిల్చొని వాళ్ళ మాటలన్నీ వింటాడు. రుద్రని చూసి గంగ షాక్ అవుతుంది. నిన్ను మా ఇంట్లో మా వాళ్ళు పెట్టారు.. మా తప్పు కుడా ఉంది కాబట్టి తల వంచానని రుద్ర అంటాడు. మాపై మాట పడకుండా నువ్వు వెళ్లిపోయావ్ నీపై మాట పడకుండా మేం చూడాలి కదా అందుకే నువ్వు మా ఇంటికి గానీ సూపర్ మార్కెట్ కి గానీ రకని చెప్పి రుద్ర వెళ్ళిపోతాడు. రుద్ర సర్ మాట్లాడిన దాంట్లో న్యాయం ఉందాని గంగ వెళ్ళిపోతుంది. మరొకవైపు పైడిరాజు తన భార్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. ఆ విషయం పైడిరాజు గంగకి ఫోన్ చేసి చెప్పగానే.. గంగ హాస్పిటల్ కి వస్తుంది. మరొకవైపు రుద్ర చిన్నపిల్లని హాస్పిటల్ లో చేర్పించాడు కదా చూడడానికి హాస్పిటల్ వెళ్తాడు. ఆ పాపతో మాట్లాడి తనని స్కూల్ లో జాయిన్ చేసి తన బాగోగులు చూసుకుంటానని చెప్తాడు మరొకవైపు అదే హాస్పిటల్ లో గంగ వాళ్ళుంటారు.

డాక్టర్ బయటకు వచ్చి గంగ, పైడిరాజుతో మాట్లాడుతుంది. కిడ్నీ మార్చాలి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇంజక్షన్ వెయ్యాలి లక్ష రూపాయలు కావాలని అనగానే గంగ బయటకు వెళ్లి టెన్షన్ పడుతుంది. అప్పుడే వీరు మనిషి గంగని పెళ్లి చేసుకుంటానన్న పర్సన్ వచ్చి ఇంజక్షన్ కి బిల్ కడతాడు. మీరు ఎందుకు కట్టారని గంగ అడుగుతుంది. అతనే నిన్ను పెళ్లి చేసుకుంటానన్నది అని గంగకి చెప్తాడు పైడిరాజు. నా కూతురు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు.. ఏ అర్హతతో నీ దగ్గర డబ్బు తీసుకోవాలని పైడిరాజు యాక్టింగ్ చేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.