English | Telugu

వసుధారకి చుక్కలు చూపించిన రిషి!

స్టార్ మా టీవీలో అత్యంత ప్రేక్షకాదరణ పొందుతోన్న సీరియల్ 'గుప్పెడంత మ‌న‌సు'. ఈ సీరియల్ ఎపిసోడ్ -681 లోకి అడుగుపెట్టింది. కాగా బుధవారం జరిగిన ఎపిసోడ్ లో.. ప్రాజెక్ట్ టూర్ సాకుతో రిషి, వసుధారలను దూరంగా పంపిస్తుంటారు జగతి, మహేంద్రలు. ఆ విషయన్ని రిషి కి తెలియకుండా జాగ్రత్త పడుతారు....

జగతి, మహేంద్రలు రెడీ అవుతారు. ఆ తర్వాత వెళ్దాం పదా జగతి లేట్ అవుతుందని మహేంద్ర యాక్టింగ్ చేస్తాడు. అటుగా వస్తున్న రిషిని చూసి.. ఇంకా ఎక్కువ హడావిడి చేస్తూ, "లేట్ అవుతుంది" అని అంటాడు మహేంద్ర. ఇక అందరూ బయల్దేరే టైంకి అబ్బో కడుపు నొప్పి అంటూ మహేంద్ర తన పర్ఫామెన్స్ ని మొదలెడతాడు. అది చూసిన జగతి.. ఏమైంది మహేంద్ర అంటూ తను కూడా నటిస్తుంది. "ఏమైంది డాడ్.. పదా హాస్పిటల్ కి వెళ్దాం" అని కంగారుపడుతాడు రిషి. ఏం లేదు రిషి.‌. కడుపు నొప్పిగా ఉంది. నేను టూర్ కి రాలేను. జగతి నువ్వు ఒక్కదానివి వెళ్ళని మహేంద్ర అనగా.. "నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళాలి" అని జగతి అంటుంది. మేడం మీరు డాడ్ ని చూసుకోండి.. నేను వెళ్తా టూర్ కి అని రిషి టూర్ కి బయల్దేరుతాడు. రిషి వెళ్ళాక.. "ఎలా ఉంది నా కడుపు నొప్పి నాటకం" అంటూ జగతితో సరదాగా మాట్లాడుతాడు మహేంద్ర.


మరోవైపు జగతి, మహేంద్రలు ఇంకా రావట్లేదని వసుధార ఎదురు చూస్తూ.. వాళ్ళకి ఫోన్ చేస్తుంది. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో, మళ్ళీ రిషికి ఫోన్ చేస్తుంది. రిషి కూడా ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడే వసుధార ముందు వచ్చి రిషి కార్ ఆపుతాడు. "జగతి మేడం, మహేంద్ర సర్ రాలేదా సర్" అని వసుధార అడుగుతుంది. "లేదు నేనే టూర్ కి వస్తున్నా" అని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి బయలుదేరుతారు. ఇక కార్ ఎక్కిన దగ్గర నుండి టామ్ అండ్ జెర్రీ తీరుగా ఇద్దరు గొడవపడుతుంటారు. "సర్.. మొహం ఆలా పెట్టకపోతే కొంచెం నవ్వొచ్చు కదా" అని వసుధార అంటుంది. "హీ.. హీ నాకు ఇలానే నవ్వడం వచ్చు.. నా మొహం ఇలానే ఉంటుంది" అని వెంటకారంగా రిషి మాట్లాడుతాడు. కాసేపటికి "ఒక ప్రక్కన కార్ ఆపుతాను. ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం" అని రిషి అంటాడు. రిషి అంతకముందు వసుధారతో కార్ లో ప్రయాణిస్తున్నప్పుడు తను ఎలా ప్రవర్తించిందో అన్నింటిని గుర్తుచేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.