English | Telugu

నేను కంటెస్టెంట్ దగ్గరే ఉండిపోయా..వాడు మాత్రం హోస్ట్ ఐపోయాడు!

కామెడీ స్టాక్ ఎక్స్చేంజి సీజన్ 1 ఎపిసోడ్ 1 దిల్ కుష్ కామెడీతో మంచి జోష్ గా సాగిపోయింది. ఒకొక్కళ్ళ ఎంట్రీ మంచి గ్రాండ్ గా ఉంది. ఒక్కో స్టాక్ ఎక్స్చేంజి ఎంత పర్సెంట్ కామెడీ చేస్తాడు అనే లెక్కలు కూడా ఈ షోలో చూపించారు. థర్డ్ కామెడీ స్టాక్ గా వేణు వండర్స్ ఎంట్రీ ఇచ్చాడు.

ఇక పుష్ప మూవీ సాంగ్ కి హోస్ట్ సుధీర్, వేణు ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు. తర్వాత వేణుని చూసి సుధీర్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతాడు. "ఏందీ వాడు సైలెంట్ ఐపోయాడు" అని వేణు అనేసరికి " మీతో డాన్స్ అంటే ఓకేగానీ మీ ముందు నేను మాట్లాడ్డం అంటే ఇంకేమన్నా ఉందా" అని సుధీర్ కొంచెం ఓవర్ యాక్షన్ చేసేసరికి " ఇలాగే గురువు గారు గురువు గారు అని వెనకాల ఉండి నన్ను బాగా తొక్కేశారు" అనేసరికి "నన్ను నమ్మరా మీరు" అని సుధీర్ తిరిగి అడిగాడు.. "15 సంవత్సరాల నుంచి నిన్ను నమ్మి నమ్మి నేను కంటెస్టెంట్ దగ్గరే ఆగిపోయాను..నువ్వు హోస్ట్ ఇపోయావ్. నేను నిన్ను ఇంకా నమ్మాలా " అన్నాడు వేణు. సుధీర్ కొంచెం ఎక్కువగా ఓవర్ రెస్పెక్ట్ ఇచ్చేసరికి "నువ్వు అంత ఓవర్ రెస్పెక్ట్ ఇస్తుంటే నాకు భయం వేస్తోంది" అన్నాడు వేణు. "ఇప్పటివరకు కొంత మంది స్టాక్స్ వచ్చారు కామెడీ చేస్తామని బిల్డప్ ఇచ్చారు కానీ అక్కడ సరిగా రాలేదు..నీ గురించి అందుకే ముందే అడుగుతున్నా..ఎలా వస్తుంది" అని సుధీర్ సీక్రెట్ గా అడిగేసరికి "నిన్ను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిందే నేను..నేను అంటే వేణు..వేణు అంటే ఫన్..ఇంకేంటి నీ డౌట్" అన్నాడు కౌంటర్ వేసాడు వేణు.

ఇక స్టాక్ లో 80 పర్సెంట్ ఎక్స్పీరియన్స్ అని వచ్చేసరికి అంటే "ఆల్మోస్ట్ వేణు రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్నాడు కదా" అని చైర్మన్ అనిల్ రావిపూడి అనేసరికి " ఇది సుధీర్ కావాలనే వేయించాడు" అని అన్నాడు వేణు. ఇక చివరికి "బ్లెస్స్ మీ " అని సుధీర్ వెళ్లి వేణు కాళ్ళ మీద పడేసరికి "ఇదే ఒద్దు అన్నది" అన్నాడు వేణు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.