English | Telugu

ఇప్పుడు వాళ్లంతా చనిపోయారు...ఎమోషనల్ ఐన పంచ్ ప్రసాద్!

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారం కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో అలరిస్తోంది. కంటెంట్ కొత్తగా ఉంటోంది. కాన్సెప్ట్ కి తగ్గ ప్లానింగ్ కూడా ఉండేసరికి ఈ షోకి రేటింగ్ కూడా అదే పిచ్ లో ఉంది. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. కొత్త ఏడాది రోజున ఈ షో ప్రసారం కాబోతోంది..

ఇక ఈ షో ప్రోమో చూస్తే గనక స్టార్టింగ్ అంతా సరదాగా సాగినా ఎండింగ్ లో మాత్రం కన్నీళ్లు పెట్టించేసింది. ఇందులో పంచ్ ప్రసాద్ ఫస్ట్ టైమ్ తన చిన్ననాటి ఫ్యామిలీ ఫోటోని అందరికీ చూపించాడు..ఆ ఫోటోలోని వారిని చూపిస్తూ తన ఫ్యామిలీ గురించి చెప్పాడు. ‘ మా అమ్మ అప్పట్లో బలవంతంగా ఈ ఫోటో తీయించింది. మా ఫ్యామిలీలో అమ్మానాన్నతో పాటు నాకు ఓ అక్క, అన్న ఉండేవారు. మా అన్న మంచి థియేటర్ ఆర్టిస్ట్ ఆయన్ని చూసే నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను.

కానీ.. ఇప్పుడు మా ఫ్యామిలీలో నాన్న, అన్న, అక్క ముగ్గురూ చనిపోయారు. ప్రస్తుతం నేను, అమ్మ మాత్రమే మిగిలి ఉన్నాం..ఈ ఒక్క ఫోటో మాత్రమే ఉంది మా ఇంట్లో’ అని చెబుతూ ఏడ్చేశాడు. దీంతో ప్రసాద్ ఫ్యామిలీ గురించి తెలిసి షోలో ఉన్నవారంతా భావోద్వేగానికి గురయ్యారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.