English | Telugu

Illu illalu pillalu: తన కుటుంబం జోలికి రావొద్దని విశ్వకి వార్నింగ్ ఇచ్చిన ప్రేమ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (illu illalu pillalu )'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-357 లో.. నిజం తెలుసుకున్న ప్రేమ.. విశ్వ దగ్గరికి కోపంగా వెళ్తుంది.

ఇక అటు సేనాపతి కుటుంబం, ఇటు రామరాజు కుటుంబం అంతా బయటకు వస్తారు . విశ్వని ఇష్టమొచ్చినట్టు తిడుతుంది ప్రేమ. నా దగ్గర అబద్ధం చెప్పి, కన్నీళ్ళు పెట్టుకొని నటించి అమూల్యే నిన్ను ప్రేమించిందని చెప్తావా అని విశ్వని కొడుతూ అరుస్తుంటుంది.

ఇక అది సేనాపతి ఆపుతుంటే నువ్వు మాట్లాడకు.. నీతో కూడా మాట్లాడతా అని ప్రేమ అంటుంది. నిన్ను నమ్మి దేవుడి లాంటి మామయ్యకి ఎదురుతిరిగాను.. మావాళ్ళదే తప్పు అని నేను మాట్లాడాను.. నీ కన్నీళ్ళు నమ్మాను కదరా.. అయినా చెల్లెలిని ఎలా మోసం చేయాలనిపించిందిరా.. ఒక ఆడపిల్ల జీవితాన్ని నడిరోడ్డున వేసి ఏం సాధించావ్ రా అని విశ్వని ప్రేమ తిడుతుంది.

ఇక ఆ తర్వాత ప్రేమ వాళ్ళ అత్త భద్రవతికి వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా నేను ఇంటికి తిరిగి రావాలనే అయితే అది ఎప్పటికి జరుగదు.. నువ్వు ఎంత చేసినా ఏం చేసినా ధీరజ్ నా ప్రాణం.. నేను వాడిని వదిలి రాను.. ఒకవేళ నిజంగా వాడిని నన్ను విడదీసి రప్పించాలని చూస్తే.. నా ప్రాణాలు వదిలేస్తానని ప్రేమ అంటుంది. ఇదే నా కుటుంబం.. నా కుటుంబం జోలికి వస్తే ఊరుకోనని.. విశ్వ, సేనాపతి, భద్రవతిలకి ప్రేమ వార్నింగ్ ఇస్తుంది. ఇక అందరు ఎక్కడివారు అక్కడ ఇంట్లోకి వెళ్ళిపోతారు.

ఇక నర్మదకి థాంక్స్ చెప్తుంది ప్రేమ. ధీరజ్ తో మాట్లాడాలని ప్రేమ చూస్తే.. అతను పట్టించుకోకుండా కోపంతో ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇక శ్రీవల్లి తను చేసిన తప్పుకి ఏడుస్తుంది‌. నోర్ మూస్కొని ఉంటే అన్నీ బాగుంటాయని తనని తానే తిట్టుకుంటుంది శ్రీవల్లి. ఇక ఇంట్లోకి వెళ్ళిన ప్రేమ.. తన అన్న విశ్వ కన్నీళ్ళు పెట్టుకున్నాడని, దాని వెనుక కుట్ర తనకి తెలియదని, తనని క్షమించమని రామరాజుని అడుగుతుంది. మరి ప్రేమని రామరాజు క్షమిస్తాడా.. వేదవతి మేనకోడలు ప్రేమని అర్థం చేసుకుంటుందా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.