English | Telugu

Illu illalu pillalu : దొంగతనం ప్లాన్ లో శ్రీవల్లి డ్రామా.. పదిలక్షల కోసమే అలా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -230 లో.... వాళ్ళ నాన్న తన ఇంటికి దొంగతనానికి వస్తాడని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది.. అప్పుడే వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు. శ్రీవల్లి కంగారుగా బయటకు వచ్చి మాట్లాడుతుంది. నువ్వు డోర్ ఓపెన్ చేసి పెట్టు అని వాళ్ళ నాన్న చెప్పగానే.. సరే గానీ జాగ్రత్తగా రా.. హాల్లో తిరుపతి బాబాయ్ పడుకున్నాడని చెప్తుంది.

ఆ తర్వాత శ్రీవల్లి ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చేసరికి చందు లేచి ఉంటాడు. ఈ టైం లో ఫోన్ ఎవరని అడుగుతాడు. మా అమ్మ అని కవర్ చేస్తుంది. ఆ తర్వాత ధీరజ్ రాత్రి ఇంటికి వస్తాడు. డోర్ వేసి ఉండడంతో ప్రేమకి ఫోన్ చేస్తాడు. డోర్ తియ్ అని అంటాడు. నేను తీయనని ప్రేమ అంటుంది. అప్పుడే శ్రీవల్లి వాళ్ళ నాన్న వస్తాడని డోర్ తీస్తుంది. తీరా చుస్తే ధీరజ్ ఉంటాడు. అతన్ని చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది. నువ్వేంటి వదిన ఈ టైమ్ కి అని ధీరజ్ అడుగుతాడు. నీ కోసమే డోర్ తీద్దామని అని కవర్ చేస్తుంది శ్రీవల్లి. మొన్న తియ్యలేదు కదా ప్రేమ ఎంత రిక్వెస్ట్ చేసిన వినలేదట.. మళ్ళీ ఇప్పుడేంటని ధీరజ్ అనగానే అంటే మీరు ఇబ్బంది పడుతున్నారని అని శ్రీవల్లి అంటుంది. దాంతో ధీరజ్ లోపలికి వెళ్తాడు.

ఆ తర్వాత శ్రీవల్లి ఎవరు లేకుండా చూసి మళ్ళీ బయటకి వస్తుంది. వాళ్ళ నాన్న వచ్చాడేమో అని చూసి డోర్ గడియ పెట్టదు ఆ తర్వాత ఈ తాళాలు ఎలా కన్పించేలా పెట్టాలని కిచెన్ లోకి వెళ్లి.. బీరువా తాళాలు అక్కడ పెడుతుంది. వాళ్ళ నాన్న పది లక్షలు దొంగతనం చెయ్యడానికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.