English | Telugu

Illu illalu pillalu : రామరాజు మిల్ లో దొంగతనం.. అతని కాళ్ళపై పడ్డ భాగ్యం దంపతులు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -242 లో.....ప్రేమ నర్మద కలిసి భాగ్యం వాళ్ళ బంఢారం బయట పెట్టడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు. మేమ్ ఎంత జాగ్రత్తపడ్డాం.. అయినా మా ఇంటి అడ్రెస్ ఎలా తెలిసిందని ఆనందరావు అడుగుతాడు. మీతో సెల్ఫీ తీసుకున్నా కదా అప్పుడే లొకేషన్ షేర్ చేసుకున్నానని నర్మద అనగానే ఇద్దరు షాక్ అవుతారు.

ఎంత నాటకం ఆడారు.. ఇప్పుడే మావయ్య గారికి మీ గురించి చెప్తామని ప్రేమ, నర్మద అక్కడ నుండి బయల్దేరతారు. ప్రేమ, నర్మద ఇంటికి రాగానే శ్రీవల్లి ఆడ్డుపడుతుంది. ఎంత మోసం చేశారని శ్రీవల్లితో నర్మద అనగానే మీరు చేసింది ఏంటి మోసం కదా ఇద్దరు అందరు కళ్ళు కప్పి లేచిపోయి పెళ్లి చేసుకున్నారు కదా అని ప్రేమ, నర్మదలని శ్రీవల్లి అంటుంది. మేమ్ చేసింది మోసం కాదు ప్రేమించుకొని పెళ్లిచేసుకున్నామని నర్మద అంటుంది. నిజం చెప్పకుండా శ్రీవల్లి ఎంతోగానే వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తుంది కానీ ప్రేమ, నర్మద వినిపించుకోకుండా లోపలికి వెళ్తారు. ఈ రోజు నా బండారం బయటపడిపోతుందని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది.

ఆ తర్వాత మావయ్య గారు మీకోక విషయం చెప్పాలి శ్రీవల్లి అక్క వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళని చెప్పారు కదా అని ప్రేమ, నర్మద చెప్పబోతుంటే రామరాజుకి రైస్ మిల్ లో దొంగలు పడ్డారని ఫోన్ వస్తుంది. దాంతో హడావిడిగా వెళ్ళిపోతాడు. తరువాయి భాగంలో రామరాజు దగ్గరికి భాగ్యం, ఆనందరావు వచ్చి రామరాజు కాళ్ళపై పడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.