English | Telugu

Illu illalu pillalu : శ్రీవల్లి తప్పించుకుంది.. ప్రేమ, ధీరజ్ ల మధ్య మొదలైన అనుబంధం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -245 లో... భాగ్యం, ఆనందరావు చందు దగ్గరికి వెళ్లి మీరు మంచి మనసుతో మాకు పది లక్షలు ఇచ్చారు కానీ అవి ఇప్పుడు ఇచ్చే సిచువేషన్ లో మేం లేము బాబు.. దయచేసి ఏమనుకోకండి అని భాగ్యం అనగానే చందు షాక్ అవుతాడు. ఆ డబ్బు నేనెలా కట్టాలని టెన్షన్ పడతాడు.

ఆ తర్వాత తిరుపతి తన చెయ్యి కలశంలో ఇరుక్కుపోయిందని రామరాజు దగ్గరికి వచ్చి ఏం చెయ్యాలని అడుగుతాడు. అప్పుడే ధీరజ్, సాగర్ ఒకరు రంపం, ఒకరు పెద్దకత్తెర తీసుకొని వస్తారు. దాన్ని చూసి తిరుపతి భయపడి పారిపోతాడు.ఆ తర్వాత చందు దగ్గరికి శ్రీవల్లి వెళ్తుంది. మీ వాళ్ళు ఇలా చేస్తారని అసలు అనుకోలేదని చందు అనగానే.. వాళ్ళకి ఇలా జరుగుతుందని తెలియదు కదా బావ అని శ్రీవల్లి చందు భుజంపై తల వాలుస్తుంది. ఇక్కడ నుండి వెళ్ళిపోమని చందు అనగానే శ్రీవల్లి బాధగా బయటకు వస్తుంది. హమ్మయ్య మా అమ్మ తెలివితో ఈ ప్రాబ్లమ్ నుండి బయటపడ్డాం కానీ ఇంటి పెత్తనం కూడా వస్తే బాగుండు అని శ్రీవల్లి అనుకుంటుంది.

శ్రీవల్లి ఏదో బాధపడుతుందని వేదవతి తన దగ్గరికి వచ్చి.. డబ్బు చూసి నిన్ను కోడలు చేసుకోలేదు.. నీ గుణం నచ్చి చేసుకున్నాం.. ఆస్తులు పోతే నిన్ను ఇక్కడ ఎవరు తక్కువ చూడరని శ్రీవల్లితో వేదవతి అంటుంది. అదంతా నర్మద విని.. చూసావా అత్తయ్య గారు ఎంత మంచివారు.. అలాంటి వాళ్ళని మోసం చెయ్యడానికి సిగ్గుండాలి.. ఇంకొకసారి ఇలా చేస్తే ఊరుకోనని శ్రీవల్లికి నర్మద వార్నింగ్ ఇస్తుంది.

ఆ తర్వాత ప్రేమ వర్షంలో కూర్చొని ఉంటుంది. లోపలికి రా ప్రేమ అని నర్మద అంటుంది. నేను రానని ప్రేమ చెప్తుంది. నా చెల్లికి నాపై కోపం వచ్చిందా అని నర్మద అంటుంది. ఆ వల్లి ఎంత టార్చర్ పెట్టింది. వాళ్ళ గురించి నిజం చెప్పొద్దన్నావ్.. నువ్వు నాతో మాట్లాడకు అని ప్రేమ అనగానే నర్మద బాధపడుతుంది.

తరువాయి భాగంలో ప్రేమకి జలుబు చేస్తుంది. దాంతో ధీరజ్ ఆవిరి పట్టిస్తాడు. నన్ను నువ్వు ఏం అనుకుంటున్నావు.. ఎలా అర్థం చేసుకోవాలని ధీరజ్ ని ప్రేమ అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.