English | Telugu

Guppedantha Manasu : ఇంటి జాడ చెప్పిన రంగా.. షాక్ లో వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1123 లో....వసుధార పెద్దావిడ దగ్గరికి వచ్చి.. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని అంటుంది. ఏంటని ఆవిడా అంటుంది. మీ మనవడి పేరు నిజంగానే రంగానా అని వసుధార అడుగుతుంది. అవును అందరిని అడిగావు కదా అని పెద్దవిడా అంటుంది. మీ మనవడు చిన్నప్పుటి నుండి మీ దగ్గరే ఉన్నాడా? అంటే చిన్నప్పుడు మీకు దూరంగా వెళ్ళిపోయి ఈ మధ్యే వచ్చాడా అని వసుధార అడుగుతుంటే.. ఆవిడ కంగారుపడుతుంది. లేదమ్మా నా మనవడు నాతోనే ఉన్నాడని పెద్దవిడ చెప్తుంది. అయితే మీరు ఎందుకు తడబడుతున్నారని వసుధార అనగానే... అదేం లేదని ఆవిడ అంటుంది. ఇన్ని రోజులు నా రిషి సర్ ని చూసుకున్నందుకు చాలా థాంక్స్ అని వసుధార అంటుంది.

మీరు కూడా రిషి సర్ తో పాటు సిటీకి రండి.. మీరు మా దగ్గరే ఉందురని వసుధార అనగానే.. నువ్వు వెళ్లేసరికి నువ్వు అంటున్న రిషి సర్ మీ ఇంట్లో ఉంటే అప్పుడు కూడా ఇలాగే అంటావా అని పెద్దావిడ అంటుంది. రిషి సర్ ఇక్కడ ఉండగా అక్కడ ఎలా ఉంటారని వసుధార అంటుంది. నీ నమ్మకం నీది.. వెళ్లి రెస్ట్ తీసుకోమని‌ వసుధారని పెద్దావిడ పంపిస్తుంది. వాళ్ళ మాటలు అన్ని రంగా వింటాడు.. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం వసుధార , రంగా లు బయలుదేర్తుంటే అపుడే సరోజ వస్తుంది. నీకు వెళ్ళేటప్పుడు గిఫ్ట్ ఇస్తానని అన్నాను కదా చెప్పకుండా వెళ్తున్నావని వసుధారతో సరోజ అంటుంది. ఆ తర్వాత రంగాపై తన ప్రేమని గురించి సరోజ చెప్తుంది. సరోజ వసుధారకి గిఫ్ట్ ఇస్తుంది. ఇది నా పాత చీర.. నాకు ఇష్టం లేనిది అందుకే నీకు పడేస్తున్నానని సరోజ గా పొగరుగా మాట్లాడుతుంది. సరే వెళ్లి వస్తానని వసుధార చెప్తుంది. వెళ్ళు మళ్ళీ రాకని సరోజ అంటుంది. వసుధార, రంగా లు ఇద్దరు బయలుదేర్తారు. మా బావ ఇంటికి వచ్చేవరకు నాకు టెన్షన్ అని సరోజ అనుకుంటుంది.

మరొకవైపు అనుపమ వాళ్ళ పెద్దమ్మకి ఫోన్ చేసి ఎవరో బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయం చెప్తుంది. ఆ తర్వాత వసుధార, రంగాలు వస్తారు. కొద్దీ దూరం ఆటోలో వస్తారు. నాకు నడుచుకుంటూ వెళ్ళాలని ఉందని వసుధార అంటుంది. ఇద్దరు నడుచుకుంటూ వస్తారు.. వాళ్ళకి కొద్ది దూరంలో మహేంద్ర వెళ్తుంటాడు కానీ వాళ్ళను చూడడు. ఆ తర్వాత ఎటువైపు వెళ్ళాలని రంగా అడుగుతాడు. ఎటు వైపో మీకు తెలియదా అని వసుధార అనగానే నాకెలా తెలుస్తుందని రంగా అంటాడు. సరే అటు వైపు అని వసుధార అనగానే ఇటువైపు అనుకుంటా అని రంగా అంటాడు. దాంతో వసుధార షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.