English | Telugu

Guppedantha Manasu : గతం మర్చిపోయిన రిషి.. వసుధారని గుర్తించగలడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1101 లో....వసుధార రౌడీల నుండి తప్పించుకొని పారిపోతుంటే రౌడీలు వెంబడిస్తారు. అప్పుడే రిషి వచ్చి రౌడీలని చితక బాదుతాడు. వసుధార రిషి ని చూసి ఆశ్చర్యపోతుంది. వసు ఒక్కసారిగా వెళ్ళి రిషిని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత వెనకల నుండి రౌడీ వచ్చి రిషి తలపై కొడుతుంటే వసుధార అడ్డు వెళ్తుంది. దాంతో ఆ దెబ్బ వసుధారకి తాకి కిందపడిపోతుంది. దాంతో మేడమ్.. మేడమ్ లేవండి అంటు వసుధారని రిషి లేపుతాడు.

ఆ తర్వాత వసుధార కళ్ళు తెరవకపోవడంతో రిషి తన ఫ్రెండ్ ని తీసుకొని రమ్మని వసుధారని ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు. మరొకవైపు రౌడీ లు తమ బాస్ దగ్గరికి వెళ్లి ఎవరో ఆటో డ్రైవర్ మమ్మల్ని చితకబాదాడు. ఆవిడని కూడా తీసుకొని వెళ్ళాడని వాళ్ళు చెప్పగానే.. మరి ఇప్పుడు ఆ శైలంద్ర అడిగితే ఏం చెప్పాలి.. వాడు అసలే ఏది చెప్పిన నమ్మడు అని అతను అంటాడు. ఒక పని చెయ్యండి అంటూ రౌడీలకి వాళ్ళ బాస్ ఒక ప్లాన్ చెప్తాడు. ఆ తర్వాత వసుధారని రిషి ఆటోలో కూర్చోపెడతాడు. మేడమ్ గారు మంచివారిలా ఉన్నారు.. నన్ను కాపాడబోయి తనకి దెబ్బ తగిలించుకున్నారని రిషి తన ఫ్రెండ్ కి చెప్పి ఇంటికి వెళ్ళమని చెప్తాడు. దీన్ని బట్టి రిషి గతం మర్చిపోయాడనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. మరొకవైపు అసలు వసుధార ఎక్కడికి వెళ్లిందో? ఏంటో? ఏ సిచువేషన్ లో ఉందో ఏంటో? ఆలోచిస్తేనే భయంగా ఉందని మహేంద్ర అంటాడు. మేడమ్ ఫోన్ కలవట్లేదని మను అంటాడు. తను కావాలనే వెళ్ళింది. తనకై తాను వచ్చేవరకు మనం వెయిట్ చెయ్యాలిసిందేనని మహేంద్ర అంటాడు. ఏ బాధ భరించలేకపోతున్నానని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. నాకొక మాట ఇవ్వు మను.. ఏం జరిగిన సరే అసలు నువ్వు కాలేజీని వదిలి వెళ్ళకు.. ఈ కాలేజీ రిషి ప్రాణం. దీన్ని ఆ శైలేంద్ర చేతిలోకి వెళ్లనివ్వకు.. ఆ దుర్మార్గుడు నుండి కాలేజీని కాపాడే సత్తా నీకు మాత్రమే ఉంది. కాలేజీని వాళ్ళ చేతిలోకి వెళ్ళానివ్వకని మాట ఇవ్వమని మనుతో మహేంద్ర అనగానే.. సరేనని మను మాటిస్తాడు. మనం ఇప్పుడు ఇక్కడే ఉండి సపోర్ట్ చెయ్యలని మనుకి అనుపమ చెప్తుంది.

మరొకవైపు రిషి తన ఇంటికి వసుధారని తీసుకొని వెళ్లి.. ట్రీట్ మెంట్ చేపిస్తాడు. అప్పుడే రిషిని బావ అంటూ ఒకావిడ వస్తుంది. తన పేరు సరోజ.... ఎవరో రౌడీలు మేడమ్ వెంట పడ్డారంటు రిషి జరిగింది చెప్తాడు. ఈవిడ అందంగా ఉంది.. నా బావకి దూరంగా ఉంచాలని వసుధారని చూసిన సరోజ అనుకుంటుంది. ఆ తర్వాత వసుధార స్పృహ లోని వచ్చి.. రిషి సర్ అంటూ రిషి వైపు చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.