English | Telugu

Guppedantha Manasu : కీలకంగా మారిన ఫోరెన్సిక్ రిపోర్టు..  వాడు బ్రతికే ఉన్నాడా?


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1068 లో....మహేంద్ర ఇంటికి వచ్చి నేను ఫాలో అవుతన్నానని తెలిసి డౌట్ వచ్చి శైలేంద్ర నా దగ్గరకి వచ్చాడని వసుధారకి మహేంద్ర చెప్తాడు. మనపై డౌట్ వచ్చింది ఇక వాడు మనల్ని నమ్మడని ఈ ఎండీ సీట్ వెనకాల కూడా ఏదో ఉందని చెప్పి డౌట్ పడతాడని మహేంద్ర అంటాడు... అలా ఎం కాదు ఎండీ సీట్ విషయంలో మనం అనుకున్నదే జరుగుతుందని వసుధార అంటుంది.

ఆ తర్వాత మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు మావయ్య..‌ నాకు తెలిసి ఆ రాజీవే ఫాలో అవుతున్నాడని మహేంద్రతో వసుధార అనగానే.. అప్పుడే రాజీవ్ వాళ్ళ వెనకాల ఉండి.. వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. కరెక్ట్ గా చెప్పావ్ మరదలు పిల్లా.. నిన్ను ప్రతీక్షణం ఫాలో అవుతూనే ఉంటానని రాజీవ్ అనుకుంటాడు. ఆ తర్వాత వసుధార, మహేంద్ర అనుపమలు స్టేషన్ కి వస్తారు‌. రాజీవ్ ని మను చంపాడు అంటే ఎవరు నమ్మలేదు కదా డెడ్ బాడీ ని చూసి ఫోరెన్సిక్ వాళ్ళు రాజీవ్ ది అని చెప్పారు ఇదిగో రిపోర్ట్ అనగానే అందరు షాక్ అవుతారు. ఇక ఈ క్రిమినల్ ని ఎవరు తప్పించలేరని ఇన్‌స్పెక్టర్ అంటాడు. నేరం రుజువు కానిది అలా మీరు డిక్లేర్ చెయ్యకండని వసుధార అంటుంది. ఆ తర్వాత మను బాధపడుతుంటే.. అమ్మ వసుధార ఎలాంటి సిచువేషన్ లో అయినా స్ట్రాంగ్ గా ఉండాలని నేర్పాను.. ఇప్పుడు ఆ కళ్ళలో భయమేంటని అనుపమ అంటుంది.. నేను బయపడుతున్నను కానీ శిక్ష పడుతుందేమోనని కాదు.. నా తండ్రి ఎవరో తెలుసుకోలేదని మను అంటాడు. మీరేం టెన్షన్ పడకండి మను గారు.. త్వరలోనే మీ కన్న తండ్రి ఎవరో తెలుసుకుంటారని వసుధార అంటుంది.

ఆ తర్వాత శైలేంద్ర ఏదో ఫైల్ పై సంతకం చేయకుంటే.. వసుధార ఫైల్ తీసుకొని వస్తుంది. సంతకం ఎందుకు చెయ్యలేదని అడుగుతుంది. చేయనంటూ శైలేంద్ర వాదిస్తాడు. ఆ తర్వాత ఆ రాజీవ్ బ్రతికే ఉన్నాడని తెలుసు.. ఎక్కడ ఉన్నాడో కూడ తెలుసని శైలేంద్రతో వసుధార అంటుంది. ఆ తర్వాత రాజీవ్ కి శైలేంద్ర ఫోన్ చేసి.. నీ గురించి వసుధారకి తెలుసంట అని మాట్లాడుతుంటే.. ధరణి వింటుంది. అప్పుడే ధరణిని శైలేంద్ర పిలిచి అక్కడ నుండి వెళ్ళమంటాడు.. ఆ తర్వాత దూరంగా ఉండి శైలేంద్రని ధరణి అబ్సర్వ్ చేస్తుంది. కాసేపటికి వసుధారకి ధరణి ఫోన్ చేసి.. మా ఆయన రాజీవ్ తో మాట్లాడుతున్నాడేమోనని డౌట్ గా ఉందని చెప్తుంది.. నువ్వు శైలేంద్ర ఫోన్ తీసుకొని నెంబర్ చూసి చెప్పు అని ధరణికి వసుధార చెప్పగానే.. సరే అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.