English | Telugu

Guppedantha Manasu:ఇటు కన్నింగ్ మొగుడు.. అటు కేరింగ్ వైఫ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -965 లో.. రిషిని వసుధార తనతో తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత రిషి జరిగింది మొత్తం వసుధారకి చెప్తాడు. మనం శైలేంద్ర అన్నయ్యని హాస్పిటల్ లో చూడడానికి వెళ్ళినప్పుడు.. నాకు ఎవరో ఫోన్ చేసి మీకు కావలిసిన ఇన్ఫర్మేషన్‌ కావాలంటే మీరు వెంటనే ఇక్కడికి రండి అని చెప్పగానే వెళ్లిపోయాను. అక్కడ రౌడీలు నన్ను తీసుకొని వెళ్లారు. తప్పించుకొని వెళ్తు ఫారెస్ట్ లో పడిపోయాను. అ తర్వాత నేను వాళ్ళు దగ్గర ఉన్నానని రిషి చెప్తాడు.

మిమల్ని ఎప్పటిలాగే మార్చుకుంటానని రిషికి వసుధార చెప్తుంది. ఇప్పుడు ఇంటికేనా వెళ్ళేదని రిషి అడుగుతాడు. లేదు ఇప్పుడు మిమల్ని సేఫ్ ప్లేస్ లో ఉంచాలని రిషి ని తీసుకొని వసుధార బయలుదేర్తుంది. మరొకవైపు ఆ వసుధార ఎలా తప్పించుకుంది. ఇప్పుడు ఏమి చెయ్యబోతుందని శైలేంద్ర టెన్షన్ పడుతుంటాడు. తన ప్లాన్ లు అన్ని ఫెయిల్ అవుతు ఉండడంతో శైలేంద్ర డిస్సపాయింట్ అవుతాడు. పుండు మీద కారం చల్లినట్లు అప్పుడే ధరణి వచ్చి.. ఏమైంది అలా ఉన్నారని అడుగుతుంది. ధరణికి ఏమి సమాధానం చెప్పలేక శైలేంద్ర నసుగుతు ఉంటాడు. ఈయన ప్లాన్ ఎదో ఫెయిల్ అయినట్లు ఉంది. అందుకే ఇలా ఉన్నాడు ఈయన ఇలా టెన్షన్ పడుతున్నాడంటే వాళ్లకి ఏమి కాలేదని అర్థమని ధరణి తన మనసులో అనుకుంటుంది. మరుసటిరోజు ఉదయం మహేంద్రకి ఫణీంద్ర కాల్ చేసి వసుధార ఇంటికి వచ్చిందా అని అడుగుతాడు. రాలేదు అందరికి ఫోన్ చేసి కనుకున్నానని మహేంద్ర అంటాడు. వసుధరా వస్తే ఫోన్ చెయ్ అని చెప్పి ఫణింద్ర ఫోన్ కట్ చేస్తాడు. అ తర్వాత దేవయాని వస్తుంది. వసుధార కన్పించడం లేదని ఫణింద్ర చెప్పగానే.. ఎక్కడకి వెళ్ళింది.. ఏమైనా జరిగి ఉంటుందా అని దేవయాని మాట్లాడుతుంటే తనపై ఫణీంద్ర కోప్పడతాడు. ధరణికి వసుధార కన్పించడం లేదని తెలిసి టెన్షన్ పడుతుంది.

మరొకవైపు రిషిని వసుధార తీసుకొని చక్రపాణి దగ్గరకి వస్తుంది. గాయాలతో ఉన్న రిషిని చూసి చక్రపాణి ఏమైందని అడుగుతాడు. అప్పుడు వసుధార జరిగింది మొత్తం చెప్తుంది. రిషిని వసుధార దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇన్ని రోజులు తను దూరంగా ఉంటే పడ్డ బాధని రిషికి చెప్తుంది. ఆ తర్వాత రిషి సర్ టాబ్లెట్స్ వేసుకున్నారా అని చక్రపాణి అడుగుతాడు. ఇప్పటి వరకు టాబ్లెట్స్ లాంటివి ఏమి వెయ్యలేదని వసుధార చెప్తుంది.‌ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.