English | Telugu

తెలుగు రియల్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ..మరి పవన్ కళ్యాణ్

ఉగాది వచ్చిందంటే సంతోషాలు కూడా వెంటే వస్తాయి. ఇక బుల్లితెరకు పండగే పండగ అని చెప్పొచ్చు. ఈటీవీ ఈ ఉగాదికి "ఈసారి పండగ మనదే" పేరుతో రాబోతోంది. ఇక ఈ ఈవెంట్ కి స్పెషల్ సర్ప్రైజ్ కూడా తీసుకురాబోతోంది. ఎప్పుడో జబర్దస్త్ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి సిల్వర్ స్క్రీన్ మీదకు వెళ్లిపోయిన గాలోడిని మళ్ళీ వెనక్కి రప్పించింది. అదే సుడిగాలి సుధీర్. ఈ షో హోస్ట్ చేయబోతున్నాడు సుధీర్. అలాగే ఈ షోకి "ఫామిలీ స్టార్" మూవీ హీరో హీరోయిన్స్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ వచ్చారు. "తెలుగు ఇండస్ట్రీ బంగారు కొండా ..విజయ్ దేవరకొండా" అంటూ స్టేజి మీదకు ఇన్వైట్ చేసాడు సుధీర్.

తర్వాత దిల్ రాజు కూడా ఈ షోకి వచ్చారు. సింగర్ రామ్ మిరియాల అలాగే బుల్లితెర మీద ప్రతీ రోజూ కనిపిస్తూ ఎంటర్టైన్ చేసే బ్యాచ్ మొత్తం కూడా ఈ షోలో ఫుల్ మస్తీ చేస్తూ కనిపించారు. ఇక విజయ్ దేవరకొండ రావడంతోనే "వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్" అంటూ అందరినీ సరదాగా పలకరించాడు. అలాగా ఫామిలీ స్టార్ ప్రమోషన్స్ లో గోలగోల చేసిన లేడీ గ్యాంగ్ అంతా కూడా ఈ షోకి వచ్చి ఎంటర్టైన్ చేశారు. ఇక ఒకే స్క్రీన్ మీద విజయ్ దేవరకొండని, సుడిగాలి సుధీర్ ని చూడడానికి ఆడియన్స్ ఐతే ఫుల్ వెయిట్ చేస్తున్నాం అంటూ ప్రోమో కింద కామెంట్స్ పెడుతున్నారు. "హైలీ ఇన్ఫ్లెమబుల్ కాంబినేషన్ ..ఈ ఎపిసోడ్ ని అస్సలు మిస్ చేయకుండా చూడాలి..తెలుగు రియల్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ..సుధీర్ అన్నా వెనక్కి వచ్చాడు ఇక పండగే మా అందరికీ..కొండ ఉన్నా చూడం, బండ ఉన్నా చూడం నిన్నే చూస్తాం" అంటూ క్రేజీగా కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్...

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.