English | Telugu
జబర్దస్త్ కి ఫైమా రీఎంట్రీ ఇవ్వనుందా!
Updated : Jul 29, 2023
ఫైమా పటాస్.. బిగ్ బాస్ సీజన్-6 తో అందరికీ సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఫైమా.. ఆ తర్వాత జబర్దస్త్ లోకి వచ్చింది. అక్కడ కూడా తన కామెడీ టైమింగ్ తో తనేంటో నిరూపించుకుంది. అలా బుల్లితెరపై నవ్వులు పూయించిన ఫైమాకి బిగ్ బాస్ సీజన్-6 లో అవకాశం లభించింది.
బిగ్ బాస్ హౌస్ లోకి కమెడియన్ గా అడుగుపెట్టిన ఫైమా.. హౌస్ లో నవ్వులు పూయించింది. అయితే ఒకానొక దశలో తను వేసే పంచులు ఎదుటివారిని ఇబ్బంది పెడతాయని అప్పుడే తెలిసింది. దాంతో హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ఫైమాకి అలా వెటకారంగా మాట్లాడకూడదని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయిన తను మారలేదు. దాంతో ప్రేక్షకులలో ఫైమాపై నెగెటివ్ ఇంపాక్ట్ కలిగిందనే చెప్పాలి. దాంతో బిగ్ బాస్ వీక్లీ వైజ్ ఎలిమినేషన్ లో ఫైమా బయటకొచ్చింది. అయితే ఫైమా తనకంటూ కొంత ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుంది. ఆ ఫ్యాన్స్ ఫైమా బయటకొచ్చాక గ్రాంఢ్ గా వెల్ కమ్ చెప్పారు. దీంతో అందరి దృష్టి ఫైమా మీద పడింది. అలా ఫైమా ఒక్కసారిగా సెలబ్రిటీ హోదాని దక్కించుకుంది. ఆ తర్వాత బిబి జోడీలో సూర్య తో కలిసి డ్యాన్స్ చేసి వావ్ అనిపించింది. దీంతో ఫైమాకి ఫ్యాన్ బేస్ మరింత పెరిగింది. అయితే ఫైమా తన గురించి ప్రతీ అప్డేట్ ని ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది..
ఫైమా కొన్ని రోజులుగా జబర్దస్త్ కి దూరంగా ఉంది. దానికి కారణం ఏదైనా మళ్ళీ జబర్దస్త్ కి రీఎంట్రీ ఇస్తున్నట్లు తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసిన ఒక వీడియోలో తెలియజేసింది. ఆ వీడియోలో ఫైమాని బాగా మిస్ అవుతున్నట్టు కమెడియన్ నరేశ్, జిత్తు.. తన గురించి పాజిటివ్ గా చెప్పారు. ఒకవేళ మళ్ళీ నువ్వు జబర్దస్త్ లోకి వస్తే ఎవరి టీమ్ లో ఉంటావని ఫైమాని జిత్తు అడుగగా.. బుల్లెట్ భాస్కర్ టీమ్ లో ఉంటానని ఫైమా చెప్పింది. ఎందుకంటే తనకి లైఫ్ ఇచ్చింది భాస్కర్ అన్న అంట. తనకి ఒక గుర్తింపు రావడానికి, ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసింది భాస్కర్ అన్నే అంటూ ఫైమా అంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు.. "కమ్ బ్యాక్ టూ జబర్దస్త్, నీ కామెడీని చాలా మిస్ అవుతున్నాం" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే జబర్దస్త్ లో కామెడీ ఎవరూ చేయట్లేదని, టీఆర్పీ కూడా తగ్గిపోతుంది. మరి ఒకప్పుడు నవ్వులు పూయించిన ఫైమా.. జబర్దస్త్ లోకి వచ్చి తన కామెడీతో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తుందో లేదో చూడాలి.