English | Telugu

Eto Vellipoyindhi Manasu : రమ్య భాగోతం బయటపడింది.. సవతి తల్లి తనని తప్పించగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -360 లో..... రమ్యకి నగలు సెలక్ట్ చేస్తుంది. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ మైథిలి వస్తుందని శ్రీలత అంటుంది. రేపు జరిగే ఎంగేజ్ మెంట్ ఆపడానికి ఇప్పుడే వస్తుందేమోనని శ్రీవల్లి అంటుంది. ఎందుకు వచ్చావని రామలక్ష్మిని శ్రీవల్లి అడుగుతుంది. ఈ రోజు రాత్రి కి లండన్ వెళ్లిపోతున్నా ఒకసారి బాబుని కలిసివెళ్లాడానికి వచ్చానని రామలక్ష్మి అంటుంది. అప్పుడే రామ్ రామలక్ష్మి దగ్గరికి వచ్చి.. మిస్ మా ఫ్రెండ్ కాల్ చేసాడని మాట్లాడి వస్తానని చెప్పి బయటకు వెళ్తాడు.

ఆ తర్వాత సీతాకాంత్ వస్తాడు. రా సీతా.. నీకు కాబోయే భార్యకి నగలు సెలక్ట్ చెయ్యమని శ్రీలత చెప్తుంది. రమ్యతో క్లోజ్ గా ఉంటెనన్నా రామలక్ష్మి బయటపడుతుందని నగలు తీసుకొని రమ్యకి పెడుతుంటాడు సీతాకాంత్. ఈ రమ్య బాగోతం ఇప్పుడే బయటపడేలా చేస్తానని రామలక్ష్మి అనుకుంటుంది. సీతాకాంత్ మేనేజర్ ఇంటికి వస్తాడు. మీ అకౌంట్ నుండి యాభై లక్షలు విత్ డ్రా అయ్యాయి సర్.. ఎవరు తీసారని అతను అడుగుతాడు. నేను తీయలేదు నాకు తెలియకుండా ఎవరు తీసి ఉంటారని సీతాకాంత్ అంటాడు. డబ్బులు డ్రా చేసిన వాళ్ళ పేరు ఉంటుంది కదా అని రామలక్ష్మి అనగానే.. మేనేజర్ ఫోన్ చేసి కనుక్కోగా రమ్య అనే అమ్మాయి పేరు ఉందట అని చెప్తారు‌. దాంతో అందరు షాక్ అవుతారు.

ఆ డబ్బులు ఎందుకు తీసావని రమ్యని సీతాకాంత్ అడుగుతాడు. రమ్య టెన్షన్ పడుతుంటే.. ఇప్పుడే ఇంట్లో నుండి గెంటేయ్యండి అని రామలక్ష్మి అంటుంది. దాంతో రమ్యని సీతాకాంత్ వెళ్ళమంటాడు. రమ్య వెళ్తూ శ్రీలతకి ఏదో మెసేజ్ చేస్తుంది. వెళ్తున్న రమ్యని శ్రీలత ఆపి.. నా కోడలు ఎక్కడికి వద్దు.. నేనే తనకి డబ్బులు ఇచ్చి ఇల్లు కొనమన్నా.. నా పేరు చెప్పొద్దన్న.. నువ్వు ఎన్ని అన్నా నా కోడలు చెప్పలేదని శ్రీలత అంటుంది. అవునా అని సీతాకాంత్ అంటాడు. తప్పించుకున్నారని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఎప్పుడు ఇలా మేనేజర్ ఇంటికి వచ్చి ఇలా చడక్ చెయ్యలేదు.. ఎవరో చేయించారని సందీప్ అంటాడు. ఆ మైథిలి ఇదంతా చేసి ఉంటుందని శ్రీలత వాళ్ళతో శ్రీవల్లి అంటుంది.. మరొకవైపు రామలక్ష్మి ఫోటోతో సీతాకాంత్ మాట్లాడి బయటకి వస్తాడు. ఆ గదిలో ఏముంది చూడాలని రామ్ వెళ్తాడు. అక్కడ రామలక్ష్మి ఫోటో చూసి షాక్ అవుతాడు. మా మిస్ ఫోటో అనుకుంటాడు. అక్కడ సీతాకాంత్ రామలక్ష్మి గురించి రాసింది రామ్ చదువుతాడు.. మా మిస్ సీతా భార్య సేమ్ ఉంటారా.. అందుకే సీతా మా మిస్ తో మాట్లాడతాడా అని రామ్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.