English | Telugu

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మి కోసం సీతాకాంత్ కొత్త వ్యూహం.. రామ్ ఆమె కోసం వెళ్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -344 లో..... మైథిలి రామలక్ష్మి కాదని స్వామి ఇండైరెక్ట్ గా స్వామి చెప్తాడు. నేను రామలక్ష్మిని కాదని రామలక్ష్మి కోపంగా చెప్పి వెళ్లడంతో సీతాకాంత్ బాధపడుతాడు. కానీ శ్రీలత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. రామ్ ని సందీప్ తో పంపించి సీతాకాంత్ డల్ గా కూర్చొని ఉంటాడు. ఏంటి సీతా తను మన రామలక్ష్మి కాదు.. నువ్వు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు.. నీకు డౌట్ ఉంటే నీ ఫ్రెండ్ సీఐ ఉన్నాడు కదా.. తనతో ఎంక్వయిరీ చేయించమని శ్రీలత చెప్పగానే అవునంటూ సీఐకి ఫోన్ చేస్తాడు. మనకి తను మైథిలి అని కన్ఫమ్ గా తెలుసు కదా మీరు చెప్పొచ్చు కదా అని శ్రీవల్లి శ్రీలత తో అంటుంది.

మనకి తెలుసు కానీ ఏదో ఒక మూలన డౌట్ ఉంది కదా ఈ దెబ్బతో మనకి క్లారిటీ వస్తుందని శ్రీలత అంటుంది. రామలక్ష్మి ఇంటికి వచ్చి బాధపడుతుంటే.. సుశీల ఫణీంద్ర ఇద్దరు తన దగ్గరికి వచ్చి.. ఏం జరిగిందని అడుగుతారు. రామలక్ష్మి గుడిలో జరిగింది మొత్తం చెప్తుంది స్వామికి నా గురించి తెలుసు కాబట్టి అబద్ధం చెప్పారు.. ఒకవేళ నేనే రామలక్ష్మిని అని తెలిస్తే అంటూ రామలక్ష్మి బాధపడుతుంది. ఇన్ని రోజులు చేసిన కష్టం మొత్తం వృథా అవుతుంది. నువ్వు భయటపడకు అని ఫణీంద్ర అంటాడు. మరొకవైపు రామలక్ష్మి ఫోటో ఉన్న గదిలోకి సీతాకాంత్ వెళ్తాడు. వెనకాలే రామ్ వెళ్తుంటే.. శ్రీవల్లి అపి తన గదిలోకి తీసుకొని వెళ్తుంది. ఎందుకు నాన్న ఒక్కడే ఆ గదిలోకి వెళ్తాడు. నన్ను ఎందుకు వెళనివ్వరని శ్రీవల్లిని రామ్ అడుగుతాడు. నువ్వు వెళ్ళకూడదు.. ఒక మీ నాన్ననే అందులోకి వెళ్తాడు. నువ్వు పెద్ద అయ్యాక వెళ్ళాలని రామ్ కి శ్రీవల్లి చెప్తుంది. మరోవైపు రామలక్ష్మి ఫోటో చూస్తూ సీతాకాంత్ తన బాధని చెప్పుకుంటాడు.

మరుసటి రోజు రామ్ అందరికంటే ముందు నిద్ర లేచి రెడీ అయి టిఫిన్ త్వరగా రెడీ చెయ్ అని శ్రీవల్లికి చెప్తాడు. రామ్ వచ్చేసరికి శ్రీవల్లి టిఫిన్ తో రెడీ గా ఉంటుంది. వాడు అప్పుడే లేవడు కదా అని శ్రీలత అంటుంది. ఏమో అత్తయ్య ఈ రోజు త్వరగా లేచాడు. చుడండి రెడీ అయి వస్తున్నాడని శ్రీవల్లి చెప్తుంది. ఎందుకు త్వరగా రెడీ అయ్యావని రామ్ ని శ్రీలత అడుగగా.. నాకు మిస్ క్లాస్ చెప్తుంది కదా అందుకే అని రామ్ అంటాడు. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. డ్రైవర్ తో వెళ్ళమని రామ్ తో సీతాకాంత్ అనగానే.. నువ్వు రావాలి త్వరగా రెడీ అవ్వు నిన్ను రెడీ చేస్తానంటూ సీతాకాంత్ కి డ్రెస్ ఇచ్చి త్వరగా స్నానం చేసి రమ్మని చెప్తాడు. సీతాకాంత్ ఫ్రెండ్ సీఐ ఇంటికి వస్తుంటాడు. అతన్ని చూసి వాడు ఇప్పుడు రామలక్ష్మి మైథిలి.. వేరు వేరు తను మైథిలీ అని చెప్తాడని శ్రీవల్లి, శ్రీలతలు అనుకుంటారు. ఒకవేళ వాడికి మనం అంటే కోపం ఉండి బావగారు బ్రతికి ఉన్నట్లు రామలక్ష్మి కూడా బ్రతికి ఉందని చెప్తే ఎలా అని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.