English | Telugu
Brahmamudi : భార్యని అర్థం చేసుకున్న భర్త.. ఇదే కదా సరికొత్త బ్రహ్మముడి!
Updated : Jan 23, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -626 లో.... రుద్రాణి ధాన్యలక్ష్మి లు గెస్ట్ హౌస్ తాకట్టు గురించి అడుగగా.. వచ్చాక చెప్తామని వాళ్ళతో రాజ్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు. ఇక రాజ్ , కావ్య నందగోపాల్ ని వెతుక్కుంటూ వెళ్తారు. అక్కడున్న రౌడీలని కావ్య తన ఎమోషనల్ మాటలతో గొడవ చేయకుండా ఆపుతుంది. వాళ్లు ఆగితే ఏంటి నేనున్నాను కదా అంటూ నందగోపాల్ రాజ్ ని కొట్టబోతాడు. దాంతో రాజ్ వాడిని కొడతాడు బయటకు పరిగెడుతుంటే చుట్టూ పోలీసులు వచ్చి చేరుతారు. నంద గోపాల్ కి తప్పించుకునే ఛాన్స్ ఉండదు.
రాజ్, కావ్య లు హ్యాపీగా ఫీల్ అవుతారు. నంద గోపాల్ ని పోలీసులు తీసుకొని వెళ్తుంటే.. అప్పుడే ఒకతను బైక్ పై వచ్చి నంద గోపాల్ ని షూట్ చేసి పారిపోతాడు. కంగారు గా రాజ్ కావ్యలు వాడి దగ్గరికి పరిగెత్తకుంటూ వస్తారు. వీడు చనిపోయాడని పోలీసులు చెప్పగానే రాజ్, కావ్య షాక్ అవుతారు. మీరు త్వరగా ఇక్కడ నుండి వెళ్లిపోండి మీడియావాళ్ళు వస్తారని రాజ్ ఫ్రెండ్ అయిన పోలీస్ రాజ్ కి చెప్తాడు. దాంతో కావ్యని తీసుకొని రాజ్ బయల్దేరతాడు. ఎప్పుడెప్పుడు రాజ్, కావ్యలు వచ్చి నిజాలు భయటపెడుతారోనని రుద్రాణి ధాన్యలక్ష్మి ఇద్దరు వెయిట్ చేస్తుంటారు. ఇంటికి వస్తూ రాజ్ కావ్య ఇద్దరు టెన్షన్ పడతారు. అసలు ఇలా జరుగుతుంది అనుకోలేదు. అనవసరంగా ఇంట్లో వాళ్ళకి జరిగింది చెప్తానని చెప్పేశాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉందని రాజ్ టెన్షన్ పడతాడు. అందుకే అలా తొందరపడి మాటివ్వకూడదని కావ్య అంటుంది.
ఇంట్లో అందరు కావ్య, రాజ్ కోసం చూస్తుండగా.. వాళ్లు ఎంట్రీ ఇస్తారు. ఇక చెప్పండి అసలేం జరిగింది.. ఎందుకు ఆస్తులన్నీ తాకట్టు పెడుతున్నారని ధాన్యలక్ష్మి నిలదీస్తుంది. ఇప్పుడేం చెప్పలేమని కావ్య అనగానే.. ఇదొక నాటకమంటూ రుద్రాణి అంటుంది. నా భార్యని ఎందుకు అలా అంటారు. మీ కోసం కాదు.. మా అమ్మ, నాన్నల కోసమైనా నిజం చెప్తాను.. నిజాన్ని విని తట్టుకునే ధైర్యం మీకుందా అని రాజ్ నిజం చెప్పబోతుంటే.. కావ్య ఆపుతుంది. తరువాయి భాగంలో మావయ్య గారికి ఎదురు మాట్లాడానని కావ్య ఎమోషనల్ అవుతుంటే.. నువ్వు బాధపడకు నీ గురించి నాకు పూర్తిగా అర్థమైంది.. నువ్వు బాధపడకుండా ఇక నేను చూసుకుంటానని రాజ్ అంటాడు. దాంతో రాజ్ ని కావ్య హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.