English | Telugu

biggBoss Season 7 Telugu Family Week : మోస్ట్ ఎమోషనల్ గా సాగిన ఫ్యామిలీ వీక్!

బిగ్ బాస్ సీజన్-7 లో ఫ్యామిలీ వీక్ తో మోస్ట్ ఎమోషనల్ గా సాగుతుంది. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో మొదటగా శివాజీ కొడుకు వచ్చి అందరిని సర్ ప్రైజ్ చేయగా, ఆ తర్వాత అంబటి అర్జున్ భార్య సురేఖ ఎంట్రీ ఇచ్చింది.

అంబటి అర్జున్ భార్య సురేఖ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళగానే అర్జున్ తో పాటు అందురు షాక్ అయ్యారు. ముఖ్యంగా అంబటి అర్జున్ సురేఖను చూడగానే ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపు ఇద్దరు ఎమోషనల్ అయ్యారు. నిన్ను చాలా మిస్ అవుతున్నానని అర్జున్ తో సురేఖ అంది‌. ఆ తర్వాత హౌస్ లో ఎవరెలా ఉంటున్నారు? బయట ఎలా ఉందని హౌస్ మేట్స్ అడుగగా.. ఏమో తెలియదు.. గుర్తులేదు. మర్చిపోయా అని సురేఖ కామెడీ చేసింది. దాంతో హౌస్ మేట్స్ అంతా నవ్వుకున్నారు. కాసేపటికి అంబటి అర్జున్-సురేఖ దంపతులిద్దరు సపరేట్ గా మాట్లాడుకున్నారు.

నువ్వు గేమ్స్ ఆడుతున్నావ్ కానీ హౌస్ మేట్స్ తో సరిగ్గా ఉండటం లేదని, సరిగ్గా రియాక్ట్ అవ్వడం లేదని సురేఖ అంది. ఇద్దరు కాసేపు ఎమోషనల్ అయ్యారు. సురేఖ మిస్ అవుతున్నానని అనగానే.. అంబటి అర్జున్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇక హౌస్ లో సురేఖ సీమంతం కూడా చేశారు. ఆ తర్వాత అశ్వినిశ్రీ వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. అలా వాళ్ళ అమ్మని చూసిన అశ్వినిశ్రీ చిన్నపిల్లలా ఏడ్చేసింది. కాసేపు ఇద్దరు సపరేట్ గా మాట్లాడుకున్నారు. "నువ్వు ప్రతీదానికి ఏడుస్తున్నావ్. అలా ఏడ్వకూడదు. నిన్ను నువ్వు స్ట్రాంగ్ అని నిరూపించుకో. నువ్వు వీక్ అనుకునేవాళ్ళకి నీ ఆటతో నిరూపించు" అంటూ అశ్వినిశ్రీ వాళ్ళ అమ్మ చెప్పుకొచ్చింది. కాసేపటికి సోను అనే కుక్కపిల్ల ఫోటోని అశ్వినిశ్రీకి గిఫ్ట్ గా తీసుకొచ్చింది వాళ్ళ అమ్మ. అది చూసి అశ్వినిశ్రీ ఏడ్చేసింది. ఇంటి నుండి బయటకు వెళ్లే సమయం ఆసన్నమైందని బిగ్ బాస్ అన్నప్పుడు.. ఈ ఒక్క రోజు మా అమ్మని హౌస్ లో ఉంచుకుంటాను బిగ్ బాస్ అని అశ్వినిశ్రీ అనేసరికి అందరు ఎమోషనల్ అయ్యారు. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో మొత్తంగా ముగ్గురు కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీలు వచ్చారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.