English | Telugu

రాధ ఎవరనుకున్నావ్ కోహినూర్ వజ్రం.. 


"కుక్కు విత్ జాతి రత్నాలు" షో త్వరలో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ మాచిరాజు జడ్జెస్ గా అలనాటి అందాల నటి రాధ, మూవీస్ లో విలన్ రోల్స్ లో కనిపించే ఆశిష్ విద్యార్థి, వాహ్ చెఫ్ సంజయ్ తుమ్మ ఉండబోతున్నారు. ఇక షోలో వంటలు చేసి అలరించడానికి ఈటీవీ నటుడు ప్రభాకర్, ప్రియా, యష్మి, బాబా భాస్కర్, సుజిత, సుహాసిని, విజె సున్ని, అవినాష్, విష్ణుప్రియ, రీతూ చౌదరి, బాలు అలియాస్ విషుకాంత్ వంటి వాళ్లంతా రాబోతున్నారు. ఐతే రోజూ ఒక ప్రోమోని రిలీజ్ చేస్తూ వస్తోంది స్టార్ మా. రీసెంట్ గా ఒక ప్రోమోని రిలీజ్ చేశారు. రాధ సిగ్గు పడుతూ కూర్చుంటే ఆశిష్ విద్యార్థి డైలాగ్ వేశారు. "ప్రదీప్ ఎవరయ్యా చెప్పింది బ్రిటీషర్ లు కోహినూర్ వజ్రాన్ని తీసుకుపోయారని ..చూడు మన పక్కనే కూర్చుంది" అన్నారు.

వెంటనే ప్రదీప్ "పోకిరి సినిమాలో మహేష్ బాబును చూసి పోలీసా" అనే ఎక్స్ప్రెషన్ ఇస్తారు కదా మీరు...అలా ఈ మధ్యన మీరు ఫుడ్డుని చూసి ఫుడ్డా అని ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు" అంటూ ఆశిష్ విద్యార్థిని ఉద్దేశించి అన్నాడు. వెంటనే రాధ.. "నేను చూసాను ఆయనకు ఏదైనా ఫుడ్ నచ్చితే వేళ్ళు మొత్తం నాకేస్తారు" అంటూ చేసి మరి చూపించింది రాధ. తర్వాత "పెళ్ళికి ముందు కుకింగ్ ఎంటర్టైనింగ్ గా ఉందా పెళ్లి తర్వాత కుకింగ్ ఎంటర్టైనింగ్ గా ఉందా" అని సంజయ్ తుమ్మని అడిగాడు. "తిన్నాక తల్లి ఎం చేస్తుంది. చాల బాగా చేసావ్ రా అంటుంది. కానీ భార్య" అని చెప్పబోయేంతలో "రేపు కూడా మీరే చేయండి అంటుంది" అని ఫన్నీ డైలాగ్ వేసాడు. ఇలా ఈ షో ప్రోమో కూడా ఎంటర్టైనింగ్ గా ఉంది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.