English | Telugu

'నా లైఫ్ చాలా మారిపోయింది'.. ఎమోష‌న‌ల్ అయిన‌ కండక్టర్ ఝాన్సీ

కండక్టర్ ఝాన్సీ ఇప్పుడు బుల్లితెర మీద కూడా ఫుల్ ఫేమస్ ఐపోయింది. శ్రీదేవి డ్రామా కంపెనీలో పల్సర్ బైక్ సాంగ్ తో ఒక్కసారిగా ఆమెకు పేరొచ్చి పడింది. ఐతే తనకు డాన్స్ అంటే ఇష్టమని కానీ ఈ రంగాన్ని ఎంచుకున్నందుకు బంధువులతో పాటు తనను చాలామంది తిట్టారని ఝాన్సీ ఆ స్టేజి పై చెప్పింది.

ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో వర్షతో కలిసి ఇండియన్ డాన్స్ ఫైనల్స్ పేరుతో జరిగే కాంపిటీషన్ లో ఝాన్సీ పార్టిసిపేట్ చేసే స్కిట్ ఉంది. ఇక విన్నర్ గా ఇంద్రజ ఝాన్సీ పేరు అనౌన్స్ చేస్తుంది. డాన్స్ ఐపోయాక "ఝాన్సీ అంటే కండక్టర్ అనుకున్నావ్.. జనరేటర్ తగ్గేదేలే" అంటూ బులెట్ భాస్కర్ కి అదిరిపోయే డైలాగ్ చెప్పింది.

ఇక స్కిట్ ఐపోయాక రష్మీ స్టేజి మీదకు వచ్చి "ఝాన్సీ గారు మీ పెర్ఫార్మెన్స్ రీసెంట్ గా టీవిలో టెలికాస్ట్ అయ్యింది. మరి లైఫ్ ఎలా ఉంది?" అని అడిగేసరికి ఝాన్సీ స్పందిస్తూ "ఎందుకు డాన్స్ చేసావ్ అన్నవాళ్ళే ఇప్పుడు ఫోన్ చేసి మీ వల్ల మా ఫామిలీ పరువు నిలబడింది" అని చెప్తున్నారు. ఈ స్టేజికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు" అంటూ స్టేజి మీదే ఎమోషనల్ అయ్యింది. అలా ఏడుస్తూనే జబర్దస్త్ స్టేజిని ముద్దాడింది కండక్టర్ ఝాన్సీ.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.