English | Telugu

Brahmamudi : రాజ్ కోసం రుద్రాణి కొత్త డ్రామా.. చిక్కుల్లో పడ్డ కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -701 లో....రాజ్ ఇంటికి వచ్చి అపర్ణ గారితో కేక్ కట్ చేయించామని హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాజ్ వెళ్ళిపోయాక.. ఏంటి అల్లుడు గారు అపర్ణ అంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు.. అసలు అపర్ణ ఎవరు అని యామినిని తన తల్లి వైదేహి అడుగుతుంది. రాజ్ కన్నతల్లి అపర్ణ.. ఎదో ఒక రకంగా ఆ కావ్య రాజ్ ని కలుస్తుందని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఎంతైనా కన్నతల్లి కదా అని యామిని వాళ్ళ నాన్న అంటుంటే.. నువ్వు మళ్ళీ వాళ్ళకి ఫేవర్ గా మాట్లాడకని యామిని కోప్పడుతుంది.

కావ్యలాగే ఇప్పుడు అపర్ణ వదిన కూడా తయారయ్యిందని రుద్రాణి అంటుంది. ఇప్పుడు ఏమైంది అపర్ణ వదిన బాగుంది కదా అని ప్రకాష్ అంటాడు. అప్పుడే అపర్ణ, కావ్య గుడి నుండీ ఇంటికి వస్తారు. అపర్ణ సంతోషంతో అందరికి ప్రసాదం ఇస్తుంది. తను హ్యాపీగా ఉండడం చూసి అందరు ఆశ్చర్యపోతారు. నా కొడుకు మళ్ళీ తిరిగి వస్తాడని ఇప్పుడు నాకు నమ్మకం కలిగిందని అపర్ణ చెప్తుంది. మీ అత్తయ్య చెప్పేది నిజమా రాజ్ ఉన్నాడా అని సుభాష్ అనగానే.. అన్నింటికి సమాధానం దొరుకుతుంది.. కొన్ని రోజులు వెయిట్ చెయ్యండి అని కావ్య చెప్పి వెళ్ళిపోతుంది. మరొకవైపు రాజ్, కావ్య అడ్రెస్ తెలుసుకోవడానికి తను పంపిన కొరియర్ పై చూస్తాడు. అందులో ఫ్రమ్ అడ్రెస్స్ ఉండదు. దాంతో కొరియర్ వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతాడు. అది ఒక పోలీస్ స్టేషన్ నుండి వచ్చిందని వాళ్ళు రాజ్ కి చెప్తారు. ఎలాగైనా కనుక్కోవాలని రాజ్ అనుకుంటాడు.

ఆ తర్వాత అపర్ణ దగ్గరికి కావ్య వచ్చి భోజనం చెయ్యడానికి తీసుకొని వెళ్తుంది. అందరు భోజనం చెయ్యడానికి వెళ్తుంటే రుద్రాణి ఆపుతుంది. అప్పుడే కొంతమంది వస్తారు. రాజ్ లేడని మనం ఎంత బాధపడుతున్నామో వాళ్ళు కూడా బాధపడుతున్నారని రుద్రాణి అంటుంది. అపర్ణ ఏమైనా అంటుందేమోనని అపర్ణని కావ్య ఆపుతుంది. తరువాయి భాగంలో మా బిల్స్ క్లియర్ చెయ్యాలని ఇద్దరు కావ్య కోసం ఇంటికి వస్తారు. మీ బిల్స్ క్లియర్ చెయ్యాలంటే రాజ్ సంతకం కావాలి. లేకపోతే ఈ డెత్ సర్టిఫికెట్ పై కావ్య సంతకం చేయాలి లేదా రాజ్ రావాలని కావ్యని ఇరకాటంలోకి పడేస్తుంది రుద్రాణి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.