English | Telugu

Brahmamudi : అబార్షన్ ట్యాబ్లెట్ తెచ్చిన రాజ్.. గది నిండా పిల్లల ఫోటోలతో కావ్య డెకరేషన్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -838 లో... రాజ్, కళ్యాణ్ ఇంట్లో జరుగుతున్న సిచువేషన్ గురించి మాట్లాడుకుంటారు. అన్నయ్య ఎన్ని రోజులు ఇలా నిజం దాస్తావ్.. ఎప్పుడో ఒక్కప్పుడు నిజం తెలిసేదే కదా అని కళ్యాణ్ అనగానే కావ్యకి నిజం తెలిస్తే తన ప్రాణానికి అయినా తెగించి బిడ్డకి జన్మనిస్తానంటుందని రాజ్ అంటాడు.

ఆ తర్వాత రాజ్, కళ్యాణ్ మెడికల్ షాప్ కి వస్తారు. కావ్యకి అబార్షన్ టాబ్లెట్ తీసుకోడానికి వస్తారు. డాక్టర్ పంపించాడు అని చెప్పి తీసుకొనిరా అని కళ్యాణ్ ని రాజ్ పంపిస్తాడు. మరొకవైపు అపర్ణ, కావ్య, ఇందిరాదేవి ముగ్గురు కలిసి రాజ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడోనని మాట్లాడుకుంటారు. ఎలాగైనా అతను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో కనుక్కుంటానని కావ్య అంటుంది.

కళ్యాణ్ మెడికల్ షాప్ కి వెళ్లి డాక్టర్ సుధాకర్ గారు పంపారు. ఈ టాబ్లెట్ ఇవ్వండి అని అంటాడు. ఇది అబార్షన్ టాబ్లెట్.. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వనని మెడికల్ షాప్ అతను అంటాడు. మిమ్మల్ని డాక్టర్ పంపించాడంటున్నారు కదా నేను ఫోన్ చేస్తానని అతను అంటాడు. అలా చేస్తే దొరికిపోతామని రాజ్ కి కళ్యాణ్ ఫోన్ చేసి, డాక్టర్ తో మాట్లాడినట్లు మాట్లాడతాడు. డాక్టర్ లా రాజ్ అతనితో మాట్లాడతాడు. అప్పుడు ఆ మెడికల్ షాప్ అతను టాబ్లెట్ ఇస్తాడు.

ఈ విషయం వదినకి తెలియకుండా చూసుకో.. ఒకవేళ తెలిస్తే జీవితాంతం శత్రువులాగే మిగిలిపోతామని రాజ్ తో కళ్యాణ్ అంటాడు. మరొకవైపు కావ్యతో పుట్టబోయే బిడ్డ గురించి రాజ్ మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత పిల్లలకి సంబంధించిన ఫొటోస్ అన్ని గోడకి కావ్య అతికిస్తుంటే ఇందిరాదేవి వచ్చి.. వాడి మనసులో ఏముందో తెలుసుకుంటానన్నావ్ ఇలా చేస్తున్నావని అడుగతుంది. ఇవన్నీ చూస్తేనే అతను ఆలోచనలో పడుతాడని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.