English | Telugu

Brahmamudi:ఇంటిగుట్టు బయటపెడతానని రాజ్ .. అంతా తెలుసని చెప్పిన ఇంటిపెద్ద !

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో.. రాజ్ కావాలనే కావ్య ముందు నటిస్తుంటాడు. నీకు విడాకులు వచ్చాయి. ఫ్రీడమ్ వచ్చింది. ఇక నీ లైఫ్ కి నేను దారి చూపెడుతానని శ్వేతతో అంటాడు. రాజ్, శ్వేత ఇద్దరు ఒకరికొకరు కేక్ తినిపించుకుంటారు. ఆ తర్వాత బావ నువ్వు కూడ కేక్ తినిపించు.. మా వారు ఏం అనుకోరని కావ్య తన బావతో చెప్తుంది. ఇద్దరు ఒకరికొకరు ప్రేమగా కేక్ తినిపించుకోవడం చూసి రాజ్ జలస్ ఫీల్ అవుతాడు.

ఆ తర్వాత నాకు రెండు గంటలు పర్మిషన్ కావాలి. మా బావతో సరదాగా బయటకు వెళ్తానని రాజ్ ని కావ్య అడుగుతుంది. నీకు పర్మిషన్ ఇవ్వను. ఇలా చేస్తే జాబ్ లో నుండి తీసేస్తానని కావ్యతో రాజ్ అనగానే.. మరి మంచిది నా బావ ఇండియాలో ఉన్నన్ని రోజులు టైమ్ స్పెండ్ చేయోచ్చు అయిన నన్ను జాబ్ లో నుండి తీసే రైట్ తనకి లేదు. పది సంవత్సరాల అగ్రిమెంట్ ఉందని కావ్య అంటుంది. సరే వెళ్ళు పర్మిషన్ ఇస్తున్నానని రాజ్ అనగానే.. కావ్య తన బావ చెయ్యి పట్టుకొని వెళ్తుంటే రాజ్ కోపంతో మండిపోతు ఉంటాడు. మరొకవైపు ధాన్యలక్ష్మి, అనామిక ఇద్దరు డల్ గా కూర్చొని ఉంటే.. అప్పుడే రుద్రాణి వెళ్లి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. మీరు సొంతంగా వాటాల కోసం ట్రై చేసిన కూడా మీకు వస్తుంది. కానీ దాన్ని డెవలప్ చేసే కెపాసిటీ నీ భర్తకి గాని నీ కొడుకుకి గాని లేదు మీరు అపర్ణ వదిన ముందు చెయ్యి చాచాల్సిందే అని ధాన్యలక్ష్మితో రుద్రాణి అంటుంది. మరి వేరే మార్గం లేదా అని రుద్రాణిని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఉంది నువ్వు అపర్ణ వదినకి మా అమ్మకి అలాగే అపర్ణ, తన కోడలికి మధ్య గొడవలు పెట్టమని రుద్రాణి చెప్తుంది. అప్పుడే స్వప్న వచ్చి మీరు నేర్పిస్తుంది అదేనా అంటూ రుద్రాణితో గొడవ పెట్టుకుంటంది.

ముందు నీ కోడలిని గ్రిప్ లో పెట్టుకో ఆ తర్వాత మాకు చెప్దువు గానీ అని రుద్రాణితో ధాన్యలక్ష్మి అంటుంది. మరొకవైపు కావ్య తన బావతో వెళ్లడం చూడలేని రాజ్.. ఇలా చేస్తే మా ఇంటిపరువు ఏం అవుతుందని శ్వేతతో అంటాడు. మరి నువ్వు చేస్తుందేంటని రాజ్ ని శ్వేత అడుగుతుంది. కావ్య ఇలా చేస్తుందని ఇంట్లో వెళ్లి చెప్తానని రాజ్ కోపంగా వెళ్తాడ. రాజ్ ఇందిరాదేవి దగ్గరికి వెళ్లి కావ్య తన బావతో షికారుకి వెళ్ళిందని అనగానే.. షికారుకి ఏం వెళ్ళలేదు. ఇంటికే తీసుకొని వచ్చిందని అనగానే రాజ్ షాక్ అవుతాడు. భార్య వేరొకరితో క్లోజ్ గా ఉంటే చూడలేకపోతున్నాడని ఇందిరాదేవి అనుకుంటుంది. తరువాయి భాగంలో బావ నువ్వు బయట ఎందుకు ఉండడం.. ఇక్కడే ఉండు అని స్వప్న అనగానే నేను ఇక్కడ ఉండడం రాజ్ అన్నయ్యకి ఇష్టం లేదని కావ్య వాళ్ళ బావ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.