English | Telugu

Brahmamudi:మీటింగ్ లో అదరగొట్టిన దుగ్గిరాల కోడలు.. రాజ్ అడ్డంగా దొరికిపోయాడుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -330 లో.. రాజ్ కి కావ్య ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చెయ్యడు. దాంతో సుభాష్ కోపంగా రాజ్ ఎక్కడికి వెళ్ళాడు.. లేదంటే ఈ మీటింగ్ కాన్సల్ అయి ప్రెస్టిజియస్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవుతుందని సుభాష్ అంటాడు. మీటింగ్ క్యాన్సల్ కాకుండా మనం చూడొచ్చు. ఈ కాంట్రాక్టుకి సంబంధించిన డిజైన్స్ మొత్తం కావ్య మేడమ్ వేశారు.. ఆమెతో మీటింగ్ ఏర్పాటు చెయ్యొచ్చని శృతి అంటుంది.

ఆ తర్వాత ఇంత ఆలస్యంగా చెప్తావేంటని సుభాష్ అంటాడు. కాసేపటికి కావ్యని పిలిచి ఈ మీటింగ్ లో నువ్వే మాట్లాడాలని సుభాష్ చెప్తాడు. దానికి కావ్య ఒప్పుకుంటుంది. ఆ తర్వాత మీటింగ్ లో పురాతనమైన వాటికి సంబంధించిన డిజైన్స్ గురించి చెప్తూ తను గీసిన వాటిని చూపిస్తుంది. చాలా బాగున్నాయంటు వచ్చిన వాళ్ళు మెచ్చుకుంటారు. మరొక వైపు అప్పు తనకి ఉన్నంతలో పోలీస్ అవ్వడానికి కావలిసిన ఏర్పాట్లు చేసుకుంటుంది. రోజు నాకు టైమ్ కి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వమని కనకానికి అప్పు చెప్తుంది. ఆ తర్వాత మీటింగ్ అయిపోయాక వచ్చిన వాళ్ళు కావ్యని మెచ్చుకుంటారు. ఈ డిజైనర్ దొరకడం మీ అదృష్టమని వాళ్ళు పొగుడుతుంటే.. దుగ్గిరాల ఇంటి కోడలు అంటే ఏమనుకున్నారని సుభాష్ ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. అప్పుడే శ్వేతతో పాటు రాజ్ ఆఫీస్ కి వస్తాడు. మీ వైఫ్ గారు డిజైన్స్ బాగా చేశారు.. రేపటి వరకు అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చెయ్యండంటూ వచ్చిన వాళ్ళు చెప్పి వెళ్తారు. ఆ తర్వాత మీటింగ్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళావ్? కావ్య ఉంది కాబట్టి సరిపోయిందని రాజ్ పై సుభాష్ కోప్పడతాడు. ఈ అమ్మాయి ఎవరని శ్వేతని చూపిస్తు రాజ్ ని ప్రకాశ్ అడుగుతాడు. నా ఫ్రెండ్ అని రాజ్ చెప్పగానే. అయితే మాకు ఎప్పుడు చూపించలేదని సుభాష్ అంటాడు. తను క్లాస్ మేట్ అని కళ్యాణ్ అంటాడు. అవును మళ్ళీ ఈ మధ్యలో కలిసిందని కావ్య అంటుంది. మీ ఫ్రెండ్ ని మీ క్యాబిన్ కీ తీసుకొని వెళ్ళండని కావ్య అంటుంది.

ఆ తర్వాత కావ్యకి మీరిచ్చిన లాకర్ కీస్ తన గది ముందు దొరికాయని అపర్ణకి అనామిక తీసుకొని వచ్చి ఇస్తుంది. ఎలాంటి కోడలు అలాంటి కోడలికి ఇంటికి బాధ్యతలు అప్పజెప్పారంటూ ధాన్యలక్ష్మి ఎగతాళి చేస్తుంటే.. ధాన్యలక్ష్మి, అనామిక, రుద్రాణీలకీ మంచి కౌంటర్ ఇస్తుంది అపర్ణ. మీరు కావ్య ఎప్పుడు తప్పు చేస్తుందా? ఎప్పుడు తనని తిడతానా అని వెయిట్ చేస్తున్నారా? తను పొరపాటున పడేసిందేమోనని అపర్ణ అంటుంది. అదే తప్పు నా కొడలు చేస్తే ఏం చేసేదానివని ధాన్యలక్ష్మి అడుగుతుంది. అసలు నీ కోడలికి లాకర్ కీస్ ఎందుకు ఇస్తాను. ఇంటి బాధ్యతలు పెద్ద కోడలికి మాత్రమే అని అపర్ణ చెప్పి వెళ్ళిపోతుంది. దీన్ని లైట్ గా తీసుకుంది లాకర్ నుండి డబ్బులు తీసాం కదా.. డబ్బులు పోయాయని కావ్యని క్షమించదని అనామికకి రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.