English | Telugu

డిజైన్స్ వేస్తూ దొరికిపోయిన  కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -154 లో... కావ్య తనని పట్టించుకోవడం లేదని స్వప్న చెప్పగానే.. కావ్యకి సపోర్ట్ చేస్తూ రాజ్ మాట్లాడడంతో అందరు ఆశ్చర్యపోతారు. స్వప్నని వాళ్ళ అత్తగారు పట్టించుకోవాలని ధాన్యలక్ష్మి అనగానే.. నేను ఎందుకు పట్టించుకోవాలి.. ఏరి కోరి దరిద్రాన్ని తీసుకొని వచ్చారు కదా అని రుద్రాణి కోపంగా మాట్లాడి వెళ్ళిపోతుంది.

మరొక వైపు అప్పుకి హెల్ప్ చెయ్యాలని కళ్యాణ్ ఫ్రెండ్స్ తో పిజ్జా ఆర్డర్ ఇప్పించి టిప్పు ఎక్కువ వచ్చేలా చేస్తాడు. దాంతో అప్పుకి కొంత డబ్బు సర్దుబాటు అవుతుంది. మరొకవైపు దుగ్గిరాల ఇంట్లో అందరు కలిసి భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ పై కూర్చొని ఉంటారు. ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఎవరికి వారు ఫోన్ చూస్తుంటారు. అది చూసిన ఇందిరా దేవి కోపంగా.. అందరు ఏం చేస్తున్నారు. తినడానికి వచ్చారా ఫోన్ చూడడానికి వచ్చారా? భోజనం చేసేటప్పుడైనా అందరు కలిసి మాట్లాడుకోవచ్చు కదా. ఇక నుండి మీ అందరి ఫోన్ లు తినేముందు ఇక్కడ పెట్టాలని అందరి ఫోన్లు తీసుకుంటుంది. అప్పుడే అక్కడ ఉన్న రాజ్.. ఫోన్ ని కొందరు మంచికి వాడుకుంటారని కావ్యని ఉద్దేశించి అంటాడు. ఎవరని ఇందిరాదేవి అడుగుతుంది.

ఒక అమ్మాయి మనకు డిజైన్స్ ఫోన్ లో పంపిస్తుందని రాజ్ అనగానే.. ఎవరు ఆ అమ్మాయి అని ఇందిరాదేవి అడుగుతుంది. కావ్య వైపు చూస్తూ శిరీష అని చెప్తాడు. మరొక వైపు అప్పు ఇంటికి రాకపోవడంతో కనకం, కృష్ణమూర్తి లు కంగారు పడుతారు. అప్పుడే అప్పు ఇంటికి వస్తుంది. అమ్మ ఇదిగో డబ్బులు.. పిజ్జా డెలివరీ కి వచ్చినవి. మిగతా డబ్బులు రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తానని అప్పు అనగానే.. కనకం, కృష్ణమూర్తి ఇద్దరు ఎమోషనల్ అవుతారు. కావ్య తర్వాత మన ఇంటి బాధ్యత అప్పు తీసుకుందని కృష్ణమూర్తి అంటాడు.

మరొకవైపు రాజ్ నిద్రపోయాక కావ్య రాజ్ కి తెలియకుండా హాల్లో కి వెళ్లి డిజైన్స్ వేస్తుంది. రాజ్ నిద్రలేచి డిజైన్స్ వెయ్యడానికి వెళ్లిందా.. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటా అని కావ్య దగ్గరికి వస్తాడు రాజ్. కావ్య వేసే డిజైన్స్ వెనకాల నుండి చూస్తాడు. రాజ్ ని కావ్య చూస్తుంది. నాకు తెలియకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నావని కావ్యని అడుగుతాడు రాజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే!

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.