English | Telugu

Brahmamudi : దుగ్గిరాల ఇంటి వారసుడు ఆ బాబు.. నిజం చెప్పకపోతే అంతే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -393 లో.. నీ కూతురికి సవతి వచ్చిన పర్లేదు.. అతింట్లో ఉండి ఆస్తులు అనుభవించాలి అనుకుంటున్నావా అని కనకంతో రుద్రాణి అనగానే... నీలాగా ఆస్తి లేదని మొగుడ్ని వదిలేసి పుట్టింట్లో ఉండడం వద్దని రుద్రాణికి కనకం కౌంటర్ వేస్తుంది. ఆ తర్వాత అనామిక వచ్చి.. ఆస్తులు లేదని అంకుల్ ని వదిలేసావా అని అంటుంది.

అదేం లేదని రుద్రాణి అంటూ ఉంటే.. స్వప్న వచ్చి నీ పిట్ట కథ మాకెందుకని అంటుంది. మరొకవైపు సీతారాముల కథని పంతులు చెప్తుంటే.. అందరు వింటుంటారు.. ఆ తర్వాత కళ్యాణ్ ని అప్పు పక్కకి తీసుకొని వస్తుంది. అసలు ఆ మీడియా వాళ్ళని ఎవరో కావాలనే రమ్మన్నారు... ఆ బాబు గురించి తెలుసుకోవడానికి ఇదంతా ప్లాన్ చేస్తున్నారని అప్పు చెప్పగానే.. అవునా ఎవరు వాళ్ళు కనుక్కోవాలని కళ్యాణ్ అంటాడు. పదా అంటూ కళ్యాణ్ చెయ్యిని అప్పు పట్టుకుంటుంది. అప్పుడే అనామిక వచ్చి.. ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడుతుంది. అది భరించలేని కళ్యాణ్.. అనామిక పై చెయ్యి చేసుకుంటాడు. నీ సంగతి చెప్తానంటూ అనామిక కోపంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అప్పు, కళ్యాణ్ ఇద్దరు జర్నలిస్ట్ దగ్గరికి వచ్చి.. మీరెందుకు వచ్చారని అడుగుతారు. న్యూస్ కవర్ చెయ్యడానికి వచ్చామని వాళ్ళు చెప్తారు.

మీడియా వాళ్ళు దుగ్గిరాల కుటుంబం దగ్గరికి వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటారు. ఈ బాబు గురించే మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంట కదా.. అసలు ఎవరు ఈ బాబు.. మిమ్మల్ని ఎండీగా కూడా తీసేసారంట కదా అని వాళ్ళు అడుగుతారు. ఈ బాబు మా బాబే నాకు నా భర్తకి పుట్టిన బాబు అని కావ్య అనగానే అందరు షాక్ అవుతారు. మీరు చెప్పండి ఈ బాబు ఎవరు అని అపర్ణని అడుగగా.. అవును ఆ బాబు నా మనవడే.. ఈ దుగ్గిరాల ఇంటి వారసుడే అంటు చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది.. ఆ తర్వాత ఇంటికి వచ్చాక.. అసలు ఇందుకే నేను రానని చెప్పానని అపర్ణ అంటుంది. తరువాయి భాగంలో.. నేను వారం గడువు ఇచ్చాను.. ఇంకా రెండు రోజులే ఉంది.. ఈ లోపు బాబు గురించి నిజం చెప్పకుంటే ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాను.. ఎవరైనా అడ్డుచెప్తే నా శవాన్ని చూస్తారని అపర్ణ అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.