English | Telugu

Brahmamudi :  రాజ్, కావ్యల శోభనం ఆపడానికి రుద్రాణి వేసిన ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -446 లో... రాజ్, కావ్య లకి శోభనం ఏర్పాట్లు చెయ్యండి. అందరు రెడీనా అని స్వప్న వాళ్ళతో అంటుంటే.. అప్పుడే కావ్య వచ్చి దేనికి రెడీ అంటున్నారని అంటుంది. దాంతో ఏం లేదంటూ డైవర్ట్ చేస్తారు. నేను వెళ్లి ఫ్రూట్స్ తీసుకొని వస్తానని ప్రకాష్ అంటాడు. దేనికి ఫ్రూట్స్ అంటూ కావ్య అడుగుతుంది. నాకే హెల్త్ బాలేదు కదా అని అపర్ణ అంటుంది. అవునా తీసుకొని రండీ జ్యూస్ చేస్తానని కావ్య అంటుంది.

ఆ తర్వాత తీసుకొని రావాసిన లిస్ట్ స్వప్న చెప్తుంటే ప్రకాష్ రాస్తుంటాడు. అప్పుడే రాజ్ వచ్చి.. ఎందుకు ఫ్రూట్స్, పూలు ఎందుకు అని అడుగుతాడు. స్వప్న, ప్రకాష్ లు ఏదో ఒకటి డైవర్ట్ చేస్తుంటారు. అప్పుడే అపర్ణ వచ్చి.. ఇంట్లో పూజ ఉంది కదా అందుకే అని కవర్ చేస్తుంది. మరొకవైపు రాజ్, కావ్యలకి శోభనం ఏర్పాటు చేస్తున్నారు. ఇలా వాళ్ళు సంతోషం గా ఉండడం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నానని రుద్రాణితో రాహుల్ అంటాడు. వాళ్ళు విడిపోతారనుకున్నాం కానీ ఇప్పుడు హ్యాపీగా ఉండి పిల్లల్ని కని ఈ ఇంటికి వారసుడిని చేస్తారు. అప్పుడు కూడా మనం ఇలాగే ఊడిగం చేస్తూ ఉండాలని రాహుల్ అనగానే.. సోది ఆపు రాత్రి పెద్ద తుపాను క్రియేట్ చేయిస్తానని రుద్రాణి అనగానే.. ఎవరితో మమ్మీ అని రాహుల్ అడుగుతాడు. ఆ అమాయకుడు కళ్యాణ్ తో అని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత అందంగా రెడీ అయి కళ్యాణ్ దగ్గరకి అనాకిక వస్తుంది. ఎందుకు ఇలా డోర్ వేసి దగ్గరగా వస్తున్నావని కళ్యణ్ అంటాడు. ఇక నుండి మనం ప్రేమగా ఉందాం.. మీ వదిన, అన్నయ్య కలిసిపోయారు కదా అని అనామిక అంటుంది. మా వదిన ఎంత అవమానం భరించింది. తన భర్తపై ఎంత నమ్మకంతో ఉంది. అందుకే వాళ్ళు కలిసిపోయారు. అసలు మా వదినలా నువ్వు ఎప్పటికి ఉండలేవు.. కనీసం నువ్వు తనలా ఆలోచించడం నేర్చుకో అంటు కళ్యాణ్ కోపంగా వెళ్లిపోతాడు.

ఆ తర్వాత జర్నలిస్ట్ ఒక ఆవిడ ఫోన్ చేసి మీపై మీ ఫ్రెండ్ పై కావాలనే కుట్ర చేసి మీ ఇద్దరిని అవుమానించారు. నేను చెప్పిన అడ్రెస్స్ కి రండి ఆధారాలతో చెప్తానని అనగానే కళ్యాణ్ బయల్దేరుతాడు. మరొకవైపు వాళ్ళ గదిలో శోభనం ఏర్పాట్లు చేస్తారు. రాజ్ తన గదిలోకి వచ్చేసరికి ఇందిరాదేవి, సీతారామయ్యలు ఉంటారు. ఈ ఒక్కరోజు మీరు మా గదిలో పడుకోండి అని ఇందిరాదేవి రాజ్, కావ్యలకి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.