English | Telugu

Biggboss 8 winner: మీ ఇంటిబిడ్డగా ఆదిరించారు.. బయటి వాడిని కాదు

బిగ్ బాస్ సీజన్-8 నిన్నటితో ముగిసింది. వంద రోజులు హౌస్ లో ఉన్న నిఖిల్ ఓ వైపు, వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ కృష్ణ మరోవైపు ఉండగా.. సస్పెన్స్ కి తెరతీస్తూ నిఖిల్ విన్నర్ అంటూ నాగార్జున ప్రకటించాడు.

విన్నర్ అని ప్రకటించగానే నిఖిల్ చాలా సర్‌ప్రైజ్ అయ్యాడు. చాలా సేపు మౌనంగా అలానే ఉండిపోయాడు. అయితే ఫేస్‌లో మాత్రం మొత్తానికి సాధించాననే గర్వం మాత్రం కనిపించింది. మరోవైపు నిఖిల్ విన్నర్ అని ప్రకటించగానే తన తల్లి, సోదరుడు ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా నిఖిల్ తల్లి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇక ట్రోఫీ తీసుకున్న తర్వాత మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు నిఖిల్. నన్ను ఇంతవరకూ తీసుకువచ్చిన ఆడియన్స్‌కి పాదాభివందనాలంటూ నిఖిల్ చెప్పాడు. ఇక ఈ విజయాన్ని తన తల్లికి అంకితం ఇస్తూ తెలుగు ఆడియన్స్ నేను బయటివాడిని కాదని ఈ విజయంతో నిరూపించారు అంటూ నిఖిల్ అన్నాడు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా అయితే తమ ఇంటి బిడ్డగా ఆదరించారో అదే ప్రేమను ఇప్పుడు కూడా కొసాగించారంటూ నిఖిల్ చెప్పాడు. మరోవైపు ఎక్స్ హౌస్‌మేట్స్ అందరికీ థాంక్యూ చెబుతూ ఈ విజయం తన ఒక్కడిదే కాదని అందరిదీ అంటూ నిఖిల్ అన్నాడు.

టైటిల్ విజేత నిఖిల్‌కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శుభాకాంక్షలు చెప్పారు. ఇన్ని రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండటం చిన్న విషయం కాదన్నారు రామ్ చరణ్. ఎక్కడైనా ఔట్ డోర్ షూటింగ్‌కి వెళ్లినప్పుడు 20 రోజులకే ఫ్యామిలీ మీద బెంగ వచ్చేస్తుందని.. కానీ మీరు ఇలా ఉండటం గ్రేట్ అంటూ చరణ్ అన్నారు. నా దృష్టిలో మీరందరూ విన్నర్స్‌యే కానీ అల్టిమేట్ విన్నర్ మాత్రం నిఖిల్ అంటూ చరణ్ చెప్పారు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.