English | Telugu
Bigg boss 9 Telugu : సంజన ఇన్ సీక్రెట్ రూమ్.. రిటర్న్ వచ్చాక మాములుగా ఉండదు!
Updated : Sep 27, 2025
బిగ్ బాస్ సీజన్-9 నిన్నటి(శుక్రవారం) నాటి ప్రోమోలో సంజన ఎలిమినేట్ అని చూపించేసరికి బిబి ఆడియన్స్ కి మతిపోయింది. బిగ్ బాస్ గేమ్ ని చేంజ్ చేసింది సంజన.. అలాంటి సంజన ఎలిమినేట్ అవ్వడమేంటని అందరు షాక్ అయ్యారు. అందులో డౌట్ లేదు. కానీ పూర్తి ఎపిసోడ్ చూసాకే అందరికి ఓ క్లారిటీ వచ్చింది.
నిన్న జరిగిన ఎపిసోడ్ లో అర్థరాత్రి డేంజర్ బెల్స్ మోగిస్తాడు బిగ్ బాస్. దాంతో హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా షాక్ అవుతారు. ఇక అందరిని సోఫాలో కూర్చోబెట్టి అసలు కథ స్టార్ట్ చేస్తాడు బిగ్ బాస్. రెడ్ గింజ కల్గిన వాళ్ళందరూ డిసైడ్ అయి.. ఒక హౌస్ మేట్ ని ఇంట్లో నుండి పంపించాలని బిగ్ బాస.. ఫ్లోరా ఇమ్మ్యూనిటీ పొందింది. దివ్యని నేనే పంపించాను.. వాళ్లిద్దరూ మినహా రెడ్ గింజ లేని వాళ్ళని పంపించాలని చెప్పగా అందరు కలిసి సంజనని డిసైడ్ చేసి పంపిస్తారు. నేను ఈ హౌస్ లో ఉండడానికి అర్హురాలిని.. కానీ బిగ్ బాస్ మాటకు రెస్పెక్ట్ ఇస్తున్నానని సంజన వెళ్ళిపోతుంది. సంజన వెళ్లిపోతుంటే ఇమ్మాన్యుయల్ ఏడుస్తాడు. సంజనని పంపించాలని స్ట్రాంగ్ గా చెప్పిన హరీష్ మాత్రం.. సంజన వెళ్తుంటే అసలు తన దగ్గరికి కూడా రాడు.. సంజన కూడా అందరికి బై చెప్తుంది కానీ హరీష్ తో మాట్లాడదు.
ఇక కాసేపటికి సంజన సీక్రెట్ రూమ్ లో ఉంటుంది. మన టీవీలో కంటెస్టెంట్స్ మాటలు వింటుంది. ఇమ్మాన్యుయల్ ఏడుస్తుంటే ఏడవకురా మళ్ళీ వస్తానని టీవీలో చూస్తూ అంటుంది సంజన. అందరు కలిసి నన్ను పంపిస్తారా అని కోపంగా అంటుంది. ఇక సంజన వెళ్ళిపోయిందనుకొని ఆవిడలా మనం చీప్ గా పనులు చెయ్యలేమని రాము, హరీష్ మాట్లాడుకుంటారు. మిగతా వాళ్ళు మళ్ళీ సంజన వస్తుందనుకుంటారు. ఇక సంజన హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక మాములుగా ఉండదు. ఒక్కొక్కరికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తుందని బిబి ఆడియన్స్ అనుకుంటున్నారు.