English | Telugu

బిగ్ బాస్ అగ్ని పరీక్ష... భార్య మీద చెయ్యెత్తిన ప్రతీ ఒక్కడూ లూజరే

బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఒక టఫ్ కంటెస్టెంట్ కి జడ్జెస్ కి మధ్య గట్టిగానే వార్ జరిగింది. బిందు మాధవి మాస్క్ మ్యాన్ హరీష్ కి క్లాస్ ఇచ్చింది. హరీష్ అభిజిత్ కి క్లాస్ ఇచ్చాడు. నవదీప్ హరీష్ కి కౌంటర్లు ఇచ్చాడు. "బిగ్ బాస్ 8 సీజన్స్ లో కరెక్ట్ విన్నర్ ఎవరు అని మీరు అనుకుంటున్నారు" అని శ్రీముఖి హరీష్ ని అడిగింది. "విజె సన్నీ..మంచి ఎంటర్టైనర్" అని చెప్పాడు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాకా నేను ఉండలేను అంటే బయటకు రావడానికి కూడా ఉండదు అని చెప్పింది శ్రీముఖి. "సమస్యే లేదు. 2017 - 2018 లో నేను నా లైఫ్ ఐపోయింది అనుకున్నా. నాకు యాక్సిడెంట్ అయ్యింది. చేతికి, కాలికి బాగా ఫ్రాక్చర్ అయ్యింది. నాకు సర్జెరీ అవుతున్నప్పుడు కూడా డాక్టర్ ని ఒకటి అడిగా. నేను పరిగెత్తగలనా అని. ఇప్పుడు మరి పరిగెత్తగలరా అని శ్రీముఖి అడిగింది. దాంతో హరీష్ స్టేజి చుట్టూ పరిగెత్తాడు.

లూజర్ అనే బోర్డుని తీసేయొచ్చు అని శ్రీముఖి చెప్పేసరికి...భార్య మీద చెయ్యెత్తిన ప్రతీ ఒక్కడూ లూజర్ ఈ బోర్డుని మెడలోని ఉంచుకుంటా అన్నాడు. నీ భార్య నిన్ను ప్రతీ రోజూ ఎలా భరిస్తోందో అంది బిందు మాధవి. ఆమె నన్ను చాలా ప్రేమిస్తుంది అన్నాడు. ఇక శ్రీముఖి బిగ్ బాస్ అనేది సత్తా ఉన్న అసామాన్యుడిని అని ప్రూవ్ చేయడానికి అని చెప్పేంతలో.."అంటే "బిగ్ బాస్ హౌస్ లోకి మనం ఫ్రెండ్ షిప్ చేసుకోవడానికి వెళ్తామా" అని అడిగాడు హరీష్. "ఫ్రెండ్స్ చేసుకుంటే తప్పేముంది" అన్నాడు అభిజిత్. "ఫ్రెండ్స్ కి ట్రోఫీ ఇచ్చేస్తారా..ఫ్రెండ్ షిప్ ఆఫ్టర్ బిగ్ బాస్ అన్నదే నేను నమ్ముతా " అంటూ అభిజిత్ కి హరీష్ క్లాస్ ఇచ్చాడు.