English | Telugu

క్రిష్ నెక్స్ట్ మూవీలో కేతమ్మకు అవకాశం

బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేస్తోంది. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఇచ్చిన ప్రతీ టాస్కులని ఆది గోల్డెన్ సీట్ ని సొంతం చేసుకుని హౌస్ లోకి వెళ్ళడానికి పోటీ పడుతున్నారు. ఇక మరో ఎపిసోడ్ లో ఈ షోకి స్పెషల్ జడ్జ్ గా క్రిష్ జాగర్లమూడి వచ్చారు. అలాగే ఆయన తీసిన "ఘాటీ" మూవీ ట్రైలర్ ని కూడా ఇందులో ప్లే చేసి చూపించారు. ఇక ఈ మూవీ గురించి క్రిష్ మాట్లాడారు. నిజానికి సీతమ్మ తల్లి అగ్ని పరీక్షను దాటుకుని బయటకు వచ్చారు పునీతలా. కానీ ఈ మూవీ ఏంటంటే సీతమ్మ తల్లి లంకా దహనం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ కాన్సెప్ట్ అని చెప్పారు.

ఇక తర్వాత కంటెస్టెంట్స్ కి టాస్కులు ఇచ్చారు. నాగా, ఊర్మిళ చేతికి షాక్ బ్యాండ్ కట్టి పేపర్ మీద స్క్వేర్ డిజైన్స్ వేయించారు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష అని రాయించారు. అందులో ఊర్మిళని సెలెక్ట్ చేశారు క్రిష్. తర్వాత కేతమ్మ వచ్చి తన జీవితాన్ని ఒక పాట రూపంలో పాడి వినిపించింది. దానికి క్రిష్ ఫిదా ఇపోయారు. ఇక వచ్చి ఆమెతో ఇలా అన్నారు. "నీకు ఇష్టం ఉంటె నా నెక్స్ట్ మూవీలో ఒక చిన్న పాత్ర చేద్దువుగాని" అన్నారు. ఇక శ్రీముఖి ఐతే కేతమ్మ నీకు అర్దమయ్యిందా సినిమాలో నటించబోతున్నావ్ అంటూ చాలా గొప్పగా చెప్పింది. కేతమ్మ హుషారైతే మాములుగా లేదు. క్రిష్ చేతులు పట్టుకుని తన ఆనందాన్ని పంచుకుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.