English | Telugu

సెలబ్రిటీస్ కన్నా వీళ్ళే బిగ్ బాస్ లో ఉంటే బాగుండేదనిపిస్తోంది..


బిగ్ బాస్ అగ్నిపరీక్షను కామన్ మ్యాన్ ని హౌస్ లోకి పంపించడానికి ఏమంటా నిర్వహించారో కానీ ఈ 15 మంది కూడా జనాల్లో ఒక ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేశారు. ఐతే 15 మందిలో ప్రియా, శ్రీజ, పవన్ కళ్యాణ్, డీమన్ పవన్ , హరీష్, మనీష్ వెళ్లి అక్కడ గేమ్ చాలా బాగా ఆడుతున్నారు. సెలబ్రిటీస్ కంటే కూడా వీళ్ళే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. ఈ ఆరుగురు కూడా స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో ఎం ఆడతార్రా బాబు అనిపించుకున్నారు కానీ లాస్ట్ కి వచ్చేసరికి అందరిలో ఒక ఇంటరెస్ట్ ని క్రియేట్ చేశారు. అలాగే అలాగే ఈ ఆరుగురితో పాటు ఎలిమినేట్ ఐన నాగప్రశాంత్, కల్కి, షాకిబ్, డాలియా, అనూష ఈ ఐదుగురు కూడా చాలా పోటాపోటీగా అగ్నిపరీక్షలో టాస్కులు ఆడారు.

ఐతే ఇప్పుడు వీళ్లంతా ఒక జట్టుగా అయ్యి ఫొటోస్ తీసుకుని వాటిని ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది కల్కి. "మన లైఫ్ లో మనకు అనుకోని ఫ్రెండ్స్ కూడా దొరుకుతారు. నేను మిమ్మల్ని మిస్ చేసుకొని గైస్" అంటూ కల్కి టాగ్ పెట్టుకుంది. ఇక నెటిజన్స్ ఐతే వీళ్ళ పిక్స్ ని చూసి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. "నాకెందుకో సెలబ్రిటీల కన్నా వీళ్లే హౌస్ లో ఉంటే బాగుండు అనిపిస్తుంది...బిగ్ బాస్ వలన మీరు ఫ్రెండ్స్ అయ్యారు. హౌస్ లోకి వెళ్తే కొట్టుకునే వాళ్ళు. థ్యాంక్ గాడ్ బయట ఉండి ఫ్రెండ్స్ అయ్యారు. మీరేం బాధపడకండి ఒక్క టీవీ షో మిమ్మల్ని డిసైడ్ చేయలేదు. బిగ్ బాస్ హౌస్ లో వీళ్ళు ఉంటే బాగుంది. మీరు బిగ్ బాస్ లో ప్లేస్ సంపాదించుకోలేదేమో కానీ ప్రజల మనస్సులో స్తానం సంపాదించుకున్నారు. వైల్డ్ కార్డు లో ఎవరైనా రావొచ్చు అని నా ఫీలింగ్. మీరంతా మాకు కూడా అలవాటై పోయారండి." అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఐతే బిగ్ బాస్ లో సెలబ్రిటీస్ మాత్రం పెద్దగా గేమ్ ఆడుతున్నట్టు కనిపించడం లేదు. ఐతే రాబోయే రోజుల్లో బిగ్ బాస్ అనుకున్నంత రేటింగ్ ని సంపాదించలేకపోతే మాత్రం ఈ ఎలిమినేట్ ఐన పర్సన్స్ నుంచి ఎవరైనా హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ తీసుకుంటారు అనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.