English | Telugu
జాక్ పాట్ కొట్టిన బిగ్ బాస్ 6 విన్నర్ రేవంత్!
Updated : Dec 19, 2022
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఎట్టకేలకు ఆదివారంతో ముగిసిపోయింది. 105 రోజులపాటు జరిగిన ఈ సీజన్ కి ఇక్కడితో ఎండ్ కార్డు పడింది. టాప్ 5గా ఉన్న రేవంత్ , శ్రీహాన్ , ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్ లో ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్‌గా రేవంత్ నిలిచారు.
ఐతే అందులోనే పెద్ద ట్విస్ట్ ఉందని అదేంటంటే ఓటింగ్ ప్రకారం శ్రీహాన్‌కి ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పారు హోస్ట్. రేవంత్‌కి మొత్తంగా ఎంత వచ్చిందనేది చూస్తే, బిగ్ బాస్ సీజన్ 6 ట్రోఫీతో పాటు 10 లక్షల ప్రైజ్ మనీ దక్కుతుంది. దీంతోపాటు `సువర్ణభూమి` వారి 650గజాల ఫ్లాట్ దక్కబోతుంది. అంటే సుమారు 30 లక్షల విలువ చేసే దీన్ని సువర్ణభూమి వారు విన్నర్‌కి ఈ గిఫ్ట్ ని ప్రకటించారు. మరోవైపు పది లక్షల విలువైన బ్రేజ్జా కారుని బహుమతిగా మారుతి సుజికి వారు ప్రకటించారు. ఇలా మొత్తంగా రేవంత్‌కి యాభై లక్షలు అందుకున్నారని చెప్పొచ్చు. మొత్తంగా రేవంత్ బిగ్ బాస్ విన్నర్‌గా సుమారు డెబ్భై నుంచి ఎనబై లక్షల వరకు పారితోషికం అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. రేవంత్‌కి ఇటీవలే కూతురు పుట్టింది. తన ఇంట్లోకి లక్ష్మీ దేవి వచ్చిందని ఆయన ఎంతో సంబరపడ్డారు. తన కూతురుకి ట్రోఫీని గిఫ్ట్ గా ఇస్తానని చెప్పడం విశేషం. అదే విషయాన్ని ఆయన స్టేజ్‌పై ఎమోషనల్ అవుతూ చెప్పారు.
శ్రీహాన్ కారణంగా రేవంత్ జాక్ పాట్ కొట్టాడు. రియల్ హీరో అయ్యారు. అయితే ఈ సీజన్‌కి మాత్రం రేవంత్, శ్రీహాన్ ఇద్దరూ విన్నర్సే అని చెప్పొచ్చు.