English | Telugu

Bigg boss 9 Telugu :భరణితో దివ్య క్లోజ్‌గా ఉంటుంది.. జెలస్ ఫీల్ అవుతున్న  ఆ ఇద్దరు!

బిగ్ బాస్ సీజన్-9 లో బోలెడు ట్విస్ట్ లు టాస్క్ లు జరుగుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ కేరాఫ్ ఉమ్మడి కుటుంబం అనేలా అందరు బిహేవ్ చేస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఈ ఒక్కరు ఖాళీగా లేరు. ఎవరో ఒకరు ఏదో బాండ్ తో ఉన్నారు. ఇక చాలా క్రేజ్ సంపాదించుకున్న బాండ్ ఏదంటే భరణి-తనూజ నాన్న నాన్న అంటూ తన చుట్టూ తిరుగుతుంది తనూజ. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అనీ సోషల్ మీడియా పాజిటివ్ ట్రోల్స్ జరుగుతున్నాయి.

ఆయితే గత వారం కింద వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది దివ్య నిఖిత. తను కూడా భరణికి బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు హౌస్ లో భరణి తనతో ఎక్కువగ ఉండడం వల్ల తనూజ జెలస్ గా ఫీల్ అవుతుంది. నువ్వు అర్ధం చేసుకుంటావ్ అమ్మ కానీ తనూజ అలా కదు నాన్న మారిపోయాడు అంటుందని ఒక సందర్బంలో దివ్య తో భరణి అంటాడు. ప్రస్తుతం జరుగుతున్న టాస్క్ లలో భరణి, దివ్య జోడిగా ఉన్నారు. మరొకవైపు సంజన కూడా జెలస్ గా ఫీల్ అవుతుంది.

ఆ పిల్ల రాకముందు తనూజతో వంద శాతం ఉంటే నాతో ముప్పై శాతం అయినా ఉండేవాడు భరణి కానీ ఇప్పుడు ఆ పిల్ల వచ్చినప్పటి నుండి నన్ను పట్టించకోవడం లేదు అసలు నేనొక దాన్ని ఉన్నానో లేనో కూడా చూడట్లేద్దని ఇమ్మాన్యుయేల్‌తో సంజన చెప్తుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.