English | Telugu

పెళ్లి ముందు రోజు పవన్ కళ్యాణ్ మూవీ..ఆ కిక్కే వేరు

యంగ్ డైరక్టర్ శ్రీరామ్ ఆదిత్య గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. "భలే మంచి రోజు" మూవీతో డైరెక్టర్ గా పరిచయమై మంచి మార్కులు సంపాదించుకున్నాడు. కానీ తరవాత అతను చేసిన శమంతకమణి, దేవదాస్‌, హీరో సినిమాలు అస్సలు ఆడకపోవడంతో కొంత కాలం గ్యాప్ తీసుకుని ఇప్పుడు శర్వానంద్ తో ఒక మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య తన వైఫ్ ప్రియాంకతో కలిసి "అలా మొదలయ్యింది" షోకి వచ్చాడు.

వీళ్ళిద్దరూ తమ లైఫ్ లో జరిగిన ఎన్నో ఇన్సిడెంట్స్ ని లవ్ స్టోరీలో ట్విస్టులను ఈ షోలో చెప్పారు. "శ్రీరామ్ ఒకసారి నాకు నచ్చిన పెర్ఫ్యూమ్ కొట్టుకొచ్చాడు అప్పుడు ఫస్ట్ టైం మాట్లాడాను. ఆయన చాలా రొమాంటిక్..మిగతా ఎవరైనా అమ్మాయిలతో మాట్లాడాలి అన్నప్పుడు నేనే హెల్ప్ చేసేదాన్ని. పని విషయంలో ఆయన చాలా కష్టపడతాడు..మా బాబు కూడా నాన్న ,నాన్న అని పిలిచి చివరికి వినకపోతే మాత్రం శ్రీరాం అని పిలుస్తాడు " అని నవ్వుతూ చెప్పింది ప్రియాంక. "మాకు రెండు పెళ్లి రోజులు ఉంటాయి. ఇప్పుడు నవ్వుతున్నాం కానీ అప్పుడు పగిలిపోయింది.

ఇంట్లో గొడవలయ్యాయి. ప్రియాంక నాకు చాలా సపోర్ట్ గా ఉంది కాబట్టే మేము ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నాం.. తానెప్పుడూ షాపింగ్ ఎక్కువగా చేస్తుంది." అని చెప్పాడు శ్రీరామ్. తమ పెళ్ళికి ఒక్క రోజు ముందు పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యింది...ఆయన మూవీ మిస్ కాకూడదు అని బెనిఫిట్ షోకి వెళ్లినట్లు చెప్పారిద్దరూ. ఇలా తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు శ్రీరామ్ ఆదిత్య. ఫైనల్ రొమాంటిక్ గా లవ్ ప్రొపోజ్ ఎలా చేసుకుంటారు అని కిషోర్ ఒక టాస్క్ ఇచ్చేసరికి శ్రీరామ్ తన వైఫ్ ని ఎత్తుకున్నాడు...ప్రియాంక ఫింగర్ రింగ్ పెట్టి ఐ లవ్ యు చెప్పింది.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.