English | Telugu
తలకిందులుగా వేలాడుతూ సుమ క్లాసులు!
Updated : Nov 16, 2023
కరోనా వచ్చిన దగ్గర నుంచి జనాలంతా కూడా చాలా హెల్త్ కాన్షస్ ఇపోయారు. ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకోవడం మొదలుపెట్టారు. అలాగే లేడీస్ కూడా ఇంట్లో పని, ఉద్యోగంతో పాటు జిమ్ సెంటర్స్ కి వెళ్లి వర్కౌట్స్ చేసి ఫిట్ గా ఉంటున్నారు. ఐతే ఇప్పుడు వాతావరణం చాల చేంజ్ అయ్యింది. అసలే చలికాలం...పని చేసినా చేయకపోయినా బద్ధకం అనేది కామన్ గా ఉంటుంది ఈ కాలంలో అందులోనూ వర్షాలు కూడా పడుతున్నాయి. దాంతో బాడీ మొత్తం దిమ్ముగా ఉండి సక్రమంగా పని చేయదు...అందుకోసం చిన్న చిన్న వర్కౌట్స్ చేస్తూ ఉంటే చాలా ఆరోగ్యం ఉండొచ్చు అంటున్నారు మన పెద్దోళ్ళు...ఇక సోషల్ మీడియాలో కూడా సెలబ్రిటీస్ చాలామంది వర్కౌట్స్ చేస్తూ ఫొటోస్ పెట్టి మిగతా లేడీస్ ని ఇన్స్పైర్ చేస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం..అలాంటి వారిలో నటి ప్రగతి, అనసూయ ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు.
ఇక రీసెంట్ గా అష్షు రెడ్డి కూడా చాలా చిక్కింది...ఇక జెంట్స్ లో అఖిల్ సార్థక్, తేజు మాదివాడ ఇలా చాల మంది కూడా జిమ్స్ కి వెళ్లి కొవ్వు కరిగిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు సుమ వంతు వచ్చింది. సుమ ఆల్రెడీ రకరకాల డాన్సులు చేస్తూ చేయిస్తూ వీలు దొరికినప్పుడల్లా చిన్న చిన్న ఎక్స్సర్సైజులు చేస్తూ చేయిస్తూ ఉంటారు. అలాంటి సుమ "హాయ్,హలో గుడ్ మార్నింగ్.. వెల్కమ్ తో శీర్షాషన్..జీవితంలో ఏదైనా ఒక రకమైన ఎక్స్సర్సైజులు చేస్తున్నారా లేదా ? ..హలో బాబు..రోజు ఫోన్ ల్లో ఛార్జింగ్ లు పెట్టుకోవడమే కాదమ్మా...బాడీని కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలి" అంటూ సుమ తల్లకిందులుగా వేళ్ళాడుతూ పొద్దుపొద్దునే ఇలా గుడ్ మార్నింగ్ చెప్తూ ఎక్స్సర్సైజుల గురించి క్లాస్ పీకింది. ఇక ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది సుమ.