English | Telugu
టీచర్స్ డేకి సుమ చేసిన వీడియో వైరల్!
Updated : Sep 5, 2023
ప్రతీ ఒక్కరు బాల్యంలో చదువుకునే రోజుల్లో టీచర్స్ డే ఎంతో ఇంపార్టెంట్. ఆ రోజున స్టుడెంట్స్ లో కొంతమంది టీచర్స్ అవుతారు. మరికొంతమంది వారి స్నేహితులలో టీచర్స్ ను చూసుకుంటారు. నేడు టీచర్స్ డే కాబట్టి సుమ తనకి చదువుని నేర్పించిన మాస్టర్స్ ని గుర్తుచేసుకుంటూ తను స్కూల్ లో ఎలా ఉందో చెప్తూ ఒక వీడియోని షేర్ చేసింది. ఇప్పుడు అది వైరల్ గా మారింది.
బుల్లితెర స్టార్ మహిళ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో స్టార్ హీరోలని, డైరెక్టర్ లను సైతం మెప్పిస్తూ యాంకరింగ్ లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఎంతమందిలో ఉన్నా.. ఏ స్టేజ్ మీద అయినా తన మాటలతో మెస్మరైజ్ చేస్తూ అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. స్పాంటేనియస్ కామెడీ పంచ్ లతో ఎప్పుడు ఆకట్టుకునే సుమ.. సోషల్ మీడియాలో కూడా తన ప్రతిభని కనబరుస్తుంది. తన యూట్యూబ్ ఛానెల్ లోను వీడియోలు చేస్తూ బిజీగా ఉంటుంది సుమ. తన యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో కొన్ని టిప్స్ ఇస్తూ వీడియోలు కూడా చేస్తుంది. రీసెంట్ గా మహిళల కోసం ఒక వీడియోని చేసి మహిళలకి విలువైన టిప్స్ ని ఇచ్చింది సుమ. తనకు తోచినదే కాకుండా మహిళలకి ఎలా ఉండాలో కొన్ని కొత్త ఐడియాలని ఇస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది.
అటు షూటింగ్స్ అంటూ బిజీగా ఉంటూనే, ఇటు ప్రమోషనల్ వీడియోలు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది సుమ. తన యూట్యూబ్ ఛానెల్ ని విజయ్ దేవరకొండ లాంచ్ చేశాడు. ఆ తర్వాత అనేక రకాల వ్లాగ్స్ చేసి అప్లోడ్ చేసింది సుమ. అందులో రాజీవ్ కనకాలతో చేసిన.. ' మా ఆయనకి నచ్చిన పులిహోర' అనే వ్లాగ్ అత్యధిక వీక్షకాధరణ పొందింది. చిన్నపిల్లలతో అల్లరి చిల్లరగా బిహేవ్ చేస్తూ ' స్ట్రెస్ బస్టర్స్ ' అంటూ కొత్త కొత్త ఎపిసోడ్‌లతో ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది సుమ. అయితే సుమ.. ' వరలక్ష్మి వ్రతానికి నేను కొన్న కొత్త చీర' అనే వ్లాగ్ ని అప్లోడ్ చేయగా అది వైరల్ అయింది. అయితే కొన్ని రోజుల క్రితం సుమ ' ది నెస్ట్' అనే ఓల్డేజ్ హోమ్ ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీచర్స్ డే సందర్భంగా మరొక వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది సుమ. 'టీచర్ వీడు నా జుట్టు లాగేస్తున్నాడు, టీచర్ సుస్సు, గుడ్ మార్నింగ్ టీచర్' అంటూ సుమ ఫన్నీగా చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. సుమ ఏం చేసినా అందులో ఒక మెసేజ్ తో పాటు ఫన్నీ ఉంటూనే పంచులు ఉంటాయి. కాగా ఇప్పుడు ఈ వీడియోకి సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.