English | Telugu

మానస్ హీరో మెటీరియల్ అంటూ ఇంద్రజ కామెంట్స్

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇక క్రిస్మస్ రాబోతున్న సందర్భంగా ఆ ఈటీవీలో ఆ సెలెబ్రేషన్స్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు శ్రీదేవి డ్రామా కంపెనీ కంపెనీ. ఈ ఈవెంట్ కి కొత్త పెళ్ళికొడుకు మానస్ నాగులపల్లి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ షోకి రష్మీ శాంతాక్లాజ్ లా రెడ్ కలర్ డ్రెస్ వేసుకొచ్చింది. ఇక స్టేజి మీదకు వచ్చిన రాంప్రసాద్ మానస్ కి "హ్యాపీ మారీడ్ లైఫ్" అంటూ విష్ చేసి "ఏంటో ఎదవలందరికీ పెళ్ళిళ్ళయిపోతాయి ముందే" అని కౌంటర్ వేసేసరికి "అందుకే నీకు ముందు అయ్యింది పెళ్లి" అని రివర్స్ కౌంటర్ ఇచ్చాడు మానస్. దానికి రాంప్రసాద్ పరువు పోయింది.

తర్వాత శ్రీ సత్యతో కలిసి ఒక రొమాంటిక్ సాంగ్ కి మానస్ మంచి హాట్ గా డాన్స్ చేసాడు.. అతని డాన్స్ చూసిన జడ్జి ఇంద్రజ " యు ఆర్ ఏ హీరో మెటీరియల్ మ్యాన్" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేసింది. ఇక గుంటూరు కారం మూవీ నుంచి ఒక మంచి సాంగ్ ని ధనుంజయ్ పాడి అందరినీ అలరించాడు. ధనుంజయ్ వాయిస్ ని ఇంద్రధనుస్సుతో పోల్చింది ఇంద్రజ. తర్వాత నాటీ నరేష్ దశావతారం మూవీలో ఒక బిట్ ని స్పూఫ్ గా చేసి చూపించి మంచి ఫన్ క్రియేట్ చేసాడు. "బట్టలు, చెప్పులు నాకు ఏనాడైనా కొంటివా...రాంప్రసాద్ అని పలికిన నోటా ఇంద్రజమ్మ అని పలకనులే" అంటూ ఆ సాంగ్ ని పేరడీ చేసి మరీ పాడాడు నరేష్. లాస్ట్ లో భావన, ఐశ్వర్య కలిసి రెయిన్ డాన్స్ వేసి అందరినీ అలరించారు. ఐతే ఈ క్రిస్మస్ ఎపిసోడ్ లో మాత్రం హైపర్ ఆది కనిపించలేదు, అలాగే వర్ష కూడా కనిపించలేదు. ఇక రష్మీ వేసుకొచ్చిన డ్రెస్ బాగుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ, వర్షా, ఆది ఎందుకు రాలేదంటూ ఆరా తీస్తున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.