English | Telugu
మోహన్ బాబుతో గొడవ..షోలో కన్నీళ్లు పెట్టుకున్న బెనర్జీ!
Updated : Sep 3, 2022
నటుడు బెనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన్ని చూస్తేనే భయపడతారు చాలా మంది. ఎందుకంటే ఎప్పుడూ సీరియస్ ఫేస్ తోనే కనిపిస్తారు. నవ్వడం అనేది చాలా అరుదు. ఇలాంటి సీరియస్ ఫేస్ వెనక కూడా కొన్ని బాధలు ఉన్నాయి. వాటిని ఆర్కే షోలో చెప్పి కంట తడి పెట్టారు బెనర్జీ. ఇండస్ట్రీలోకి డైరెక్టర్ అవుదామనుకొని వచ్చాను కానీ నటుడిని అయ్యాను. "ఎలా అంటే ఒకసారి అమితాబ్ సినిమాకు పనిచేస్తున్న టైంలో ఒక కన్నడ యాక్టర్ రాలేదు.
ఇక చేసేదేం లేక అమితాబ్ గారు నన్ను పిలిచి ఆ సీన్స్ చేయమని చెప్పారు. అలా నటుడిగా మారాను" అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ విషయానికి వస్తే మోహన్ బాబు సంగతేమిటి అని అడిగేసరికి.."కంటతడి పెట్టుకున్న బెనర్జీ చిరంజీవి గారు అసోసియేషన్ కోసం ఏదైనా చేద్దామనుకునే వ్యక్తి. ప్రకాష్ రాజ్ కూడా అంతే.
ఐతే ప్రకాష్ రాజ్ ప్యానల్ లో తనీష్ ని మోహన్ బాబు తిట్టారు. ఆ టైములో నేను అక్కడికి వెళ్లి గొడవలొద్దు అని విష్ణుతో చెప్పాను. పక్కనుంచి మోహన్ బాబు వచ్చి పచ్చి బూతులు తిట్టి కొట్టడానికి వచ్చారు. ఇక ఇదంతా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా" అని అన్నారు బెనర్జీ.