జంధ్యాల సినిమాలో హీరోయిన్గా చెయ్యనని తెగేసి చెప్పిన అమ్మాయి!
రచయితగా, దర్శకునిగా జంధ్యాలకు ఎంత పేరుందో, మంచి మనిషిగా అంతకంటే ఎక్కువ పేరుంది. ఆయనేమైనా ట్రబుల్స్ పడ్డారేమో కానీ, ఎవరికీ ఎప్పుడూ ట్రబుల్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. రైటర్‌గా ఎంతో గిరాకీ ఉన్న ఆయన బోల్డ్ స్టెప్ తీసుకొని 'ముద్దమందారం' (1981) చిత్రంతో దర్శకునిగా మారారు. 'నాలుగు స్తంభాలాట' (1982) సినిమా దర్శకునిగా ఆయనను ఓ మెట్టుపైకెక్కించింది.