English | Telugu

‘టెంపర్‌’ షూటింగ్‌ పోస్ట్‌పోన్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘టెంపర్‌’ సినిమా షూటింగ్‌ పోస్ట్‌పోన్‌ చేశారు. ఎన్టీఆర్ సోదరుడు జానకీరామ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆయన తీవ్రంగా కలిచివేసింది. దీంతో కొద్ది రోజులు సినిమా షూటింగ్ లకి దూరంగా వుండాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయాన్ని ఆయన తన సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్‌, బండ్ల గణేష్‌ లకు చెప్పడంతో, పరిస్థితిని అర్థం చేసుకున్న వారు పది రోజులపాటు షూటింగ్ ని వాయిదా వేశారు. తాజా పరిస్థితుల వల్ల ‘టెంపర్‌’ జనవరి 9న విడుదలవ్వడం కష్టమేనని అంటున్నారు. ఇండస్ట్రీ వర్గాలు మాత్రం పూరి జగన్నాథ్‌ స్పీడ్ కే సపోర్ట్ చేస్తున్నారు. సినిమాని అనుకున్న టైమ్‌లో, ఇంకాస్త ముందే ఫినిష్‌ చేయడంలో పూరి దిట్ట అని, ఎన్టీఆర్‌ సహకారంతో ‘టెంపర్‌’ని పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేస్తారని అంటున్నారు. అయితే పూరి ‘టెంపర్‌’ ని స్పీడ్ గా ఫినిష్ చేస్తాడా? లేక పోస్ట్‌పోన్‌ చేస్తాడా? అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.