English | Telugu

యన్ టి ఆర్ హీరోగా శ్రీను వైట్ల చిత్రం మార్చ్ లో

యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, ప్రేక్షకుల నాడి తెలుసుకుని హిట్ మీద హిట్ తో దూసుకుపోతున్న విభిన్న యువ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక చిత్రం ప్రారంభం కానుంది. మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా, శ్రీనువైట్ల దర్శకత్వంలో ఇటీవల విడుదలైన "దూకుడు" బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ చిత్రం తర్వాత యన్ టి ఆర్ వంటి పక్కా కమర్షియల్ మాస్ హీరోతో శ్రీనువైట్ల ఎటువంటి చిత్రం చేస్తాడాని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నార

ఈ చిత్రం మీద ప్రేక్షకుల మరియూ యన్ టి ఆర్ అభిమానుల అంచనాలు భారీగానే ఉంటాయనటంలో సందేహం లేదు. ఈ చిత్రం తాలూకు స్క్రిప్ట్ విన్న హీరో యన్ టి ఆర్ చాలా హ్యాపీగా ఫీలయ్యారని సమాచారం. ఈ చిత్రాన్ని 2012 మార్చ్ నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.