English | Telugu

'తమ్ముడు' రిలీజ్ ట్రైలర్.. నితిన్ ఈసారైనా హిట్ కొడతాడా?

2020 లో వచ్చిన 'భీష్మ' తర్వాత నితిన్ సక్సెస్ చూడలేదు. 'చెక్', 'రంగ్ దే', 'మాచర్ల నియోజకవర్గం', 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్', 'రాబిన్‌హుడ్'.. ఇలా ఐదు సినిమాలు థియేటర్లలో విడుదల కాగా.. అన్నీ పరాజయం పాలయ్యాయి. దీంతో జూలై 4న విడుదల కానున్న 'తమ్ముడు'పైనే ఆశలు పెట్టుకున్నాడు నితిన్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ కూడా.. తమ్ముడు సినిమాతో నితిన్ కమ్ బ్యాక్ ఇస్తాడనే నమ్మకాన్ని కలిగిస్తోంది.

తమ్ముడు రిలీజ్ ట్రైలర్ దాదాపు రెండున్నర నిమిషాల నిడివి ఉంది. ఎమోషన్స్, యాక్షన్ మేళవింపుతో ఓ డిఫరెంట్ సినిమా చూడబోతున్నామనే ఫీలింగ్ ఈ ట్రైలర్ తో కలుగుతోంది. అక్క, తమ్ముడు మధ్య బాండింగ్ చూపిస్తూ ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లుగా చూపించారు. అయినప్పటికీ అక్కకి ప్రాబ్లమ్ వస్తే.. తమ్ముడు ప్రాణానికి తెగించి పోరాడినట్లుగా చూపించారు. ఈ క్రమంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. టెక్నికల్ గా ట్రైలర్ సాలిడ్ గా ఉంది. బిగ్ స్క్రీన్ పై ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. ఇలా డిఫరెంట్ సెటప్ లో ఉండే యాక్షన్ సినిమాలకు ఈమధ్య ఆదరణ ఎక్కువగా ఉంటుంది. తమ్ముడుకి పాజిటివ్ టాక్ వస్తే.. నితిన్ ఎదురుచూస్తున్న సాలిడ్ హిట్ దక్కినట్లే. చూద్దాం మరి తమ్ముడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.