English | Telugu
చాలా రోజులకు బయటకొచ్చిన కోట.. అసలేం జరిగింది..?
Updated : Jun 10, 2025
తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. ఎలాంటి పాత్రకైనా ప్రాణం పోస్తారు. ఆయన కెరీర్ లో ఎన్నో మరపురాని పాత్రలు ఉన్నాయి. ప్రస్తుతం కోట వయసు 82 సంవత్సరాలు. దాంతో సినిమాలు చెయ్యట్లేదు. బయట కూడా పెద్దగా కనిపించట్లేదు. అలాంటి కోట సడెన్ గా ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం ఆయన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటో చూసిన అభిమానులు.. అసలు కోటకు ఏమైంది? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (Kota Srinivasa Rao)
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ "కోట శ్రీనివాసరావు గారితో ఈరోజు, కోటా బాబాయ్ ని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది." అంటూ తాజాగా కోట శ్రీనివాసరావుతో దిగిన ఫొటోని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ ఫొటోలో చాలా రోజులకు కోట కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆయన కాళ్ళు చూసి ఆవేదన చెందుతున్నారు. కోట శ్రీనివాసరావు ఒక కాలికి కట్టు కట్టి ఉంది, మరో కాలేమో వాచినట్టుగా కనిపిస్తోంది. మనిషి కూడా చాలా బక్కగా కనిపిస్తున్నారు. "కోట గారికి ఏమైంది? ఆయనను ఇలా చూడటం బాధగా ఉంది. కోట గారు కోలుకొని మునుపటిలా ఉండాలని కోరుకుంటున్నాము." అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
