English | Telugu

డంప్ యార్డ్ లో రష్మిక.. ఆయన చెప్పినట్టుగానే చేశాను 

'ఛలో' తో సినీ రంగ ప్రవేశం చేసిన రష్మిక(Rashmika Mandanna)అనతికాలంలోనే అగ్ర హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. పుష్ప, పుష్ప 2 , యానిమల్, చావా వంటి యూనివర్సల్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. దీంతో నాగార్జున(Nagarjuna)ధనుష్(Dhanush)తో కలిసి చేస్తున్న 'కుబేర'(Kuberaa)పై అందరిలోను భారీ అంచనాలు ఉన్నాయి. శేఖర్ కమ్ముల(Sekhar Kammula)దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర ఈ నెల 20 న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచింది. అందులో భాగంగా రీసెంట్ గా ముంబైలో 'పీపీ డుమ్, డుమ్' అనే సాంగ్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ కార్యక్రమంలో నాగార్జున, ధనుష్, రష్మిక పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతు ఒక డంప్ యార్డ్ లో నేను, రష్మిక సుమారు ఏడు గంటల పాటు షూటింగ్ లో పాల్గొన్నాం. అక్కడ అంత సేపు ఉన్నా, రష్మిక మాత్రం నాకు వాసన రావటం లేదని చెప్పింది. మరి ఆమెకి ఏమైందో నాకు తెలియదని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ధనుష్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, రష్మిక కి నటన పట్ల ఉన్న కమిట్ మెంట్ ని అభిమానులతో పాటు ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.

అనంతరం రష్మిక కూడా మాట్లాడుతు ఇంతకుముందు వేర్వేరు చిత్రాల్లో పోషించిన గీతాంజలి, శ్రీవల్లి, మహారాణి యేసుబాయి క్యారెక్టర్స్ లాగానే కుబేర లో పోషించిన క్యారక్టర్ కూడా అందరికి గుర్తుండిపోతుంది. ఒక్కో దర్శకుడిది ఒక్కో విజన్. దర్శకుడు చెప్పినట్టుగానే నేను నటిస్తాను. నాగార్జున, ధనుష్ తో నటించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది.


ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.