English | Telugu
విశాల్ ప్రేమ పెళ్లికి రంగం సిద్ధం??
Updated : Dec 30, 2014
కోలీవుడ్‌లో మరో ప్రేమ పెళ్లి చూడబోతున్నామా? ఇంత కాలం ప్రేమికులుగా ఉన్న విశాల్, వరలక్ష్మి ఇప్పుడు పెళ్లి చేసుకొంటున్నారా?? విశాల్ వరలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి అన్ని విధాలా రెడీ అయ్యాడా..?? ప్రస్తుతం కోలీవుడ్‌లో వినిపిస్తున్న ఆసక్తికరమైన ప్రశ్నలివి. విశాల్, వరలక్ష్మి గత కొంతకాలంగా ప్రేమాయాణం సాగిస్తున్నారు. ఈ విషయం రెండు కుటుంబాల్లోనూ తెలుసు. విశాల్ ఇంట్లోంచి ఎలాంటి అభ్యంతరాలు లేవు. అయితే... శరత్‌కుమార్ మాత్రం తన కూతుర్ని విశాల్‌కి ఇచ్చి పెళ్లి చేయడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడని తెలిసింది. ఈ విషయంలో విశాల్ - శరత్‌కుమార్‌ల మధ్య వాగ్యువాదం కూడా అయ్యిందట. నేను ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ పెళ్లిజరగనివ్వను అని శరత్‌కుమార్, చేసుకొంటే నీ కూతుర్నే చేసుకొంటా అని విశాల్ సినిమా రేంజులో ఛాలెంజులు విసురుకొన్నారట. వరలక్ష్మి కూడా విశాల్ వైపే ఉందట. అతి త్వరలోవిశాల్, వరలక్ష్మి పెళ్లి చేసుకొంటారని, అయితే అది శరత్ కుమార్ అంగీకారంతోనా, లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మొత్తమ్మీద తమిళ తంబీ విశాల్ త్వరలోనే తన ఇష్టసఖిని పెళ్లి చేసుకోబోతున్నాడన్నది మాత్రం తేలిపోయింది.