English | Telugu

సైడ్ హీరోయిన్ బుజ్జమ్మ బ్యాగు చోరీ..!

సరైనోడులో సాంబారు చబ్బీ బ్యూటీ, రాజుగారి గది చిత్రంలో బుజ్జమ్మ గా ఫ్యామస్ అయిన నటి నటి విద్యుల్లేఖ రామన్ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. తన డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో, ఫిమేల్ కమెడియన్స్ లో త్వరగానే పేరు తెచ్చుకుంది ఈ తమిళ భామ. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ తో మంచి బిజీగా సాగిపోతోంది విద్యు కెరీర్. రీసెంట్ ఫ్రెండ్స్ తో కలిసి సమ్మర్ టూర్ గా ఆస్ట్రియాలోని వియన్నాకు వెళ్లిన విద్యుకు అక్కడ షాక్ ఎదురైంది. ఆమె పాస్ పోర్ట్ తో పాటు, డబ్బు, విలువైన వస్తువులు ఉన్న బ్యాగ్ చోరీకి గురైంది. దీంతో తనకు సాయం చేయాల్సిందిగా ట్విట్టర్లో ప్రధానమంత్రికి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు ట్వీట్ చేసి అభ్యర్ధించింది. ఆ తర్వాత ఆమె భారత్ కు చేరుకోవడానికి అవరసరమైన ఏర్పాట్లన్నీ అక్కడి భారత ప్రభుత్వ ఎంబసీ ఏర్పాటు చేయడంతో ఊపిరి పీల్చుకుంది బుజ్జమ్మ. యూరప్ లో విదేశీ పర్యాటకులను టార్గెట్ చేసి ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా చేస్తున్నారని, అక్కడకు వెళ్లిన వాళ్లు జాగ్రత్తగా ఉండాలని తర్వాత మరో ట్వీట్ చేసింది. తమిళ టుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్యు రామన్, తమిళ తెలుగు సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఎటో వెళ్లిపోయింది మనసు, రామయ్యా వస్తావయ్యా, భలే మంచి రోజు సినిమాలతో ఆమె తెలుగు ప్రేక్షకులకు సపరిచితురాలైంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.