English | Telugu

నవంబర్ 14 పదకొండు గంటలకి వేణు స్వామికి ఏం జరగబోతుంది

ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి(venu swamy)కొన్ని రోజుల క్రితం అక్కినేని నాగ చైతన్య(naga chaitanya)శోభిత లు పెళ్లి అయిన కొన్ని సంవత్సరాలకే విడిపోతారని చెప్పిన విషయం అందరకి తెలిసిందే.దీంతో వేణుస్వామి పై ఎన్నో విమర్శలు రావడంతో పాటు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ ల సంఘం కూడా ఆయన మీద కేసు నమోదు చేయించింది.

దీంతో ఇప్పుడు జర్నలిస్టుల సంఘం లేవనెత్తిన ఆరోపణల దృష్ట్యా తెలంగాణ మహిళా కమిషన్ వేణుస్వామికి సమన్లు ​​జారీ చేసింది. నవంబర్ 14 ఉదయం పదకండు గంటలకి కమిషన్ ముందు విచారణకి హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. ఈ విషయాన్నీ మహిళా కమిషన్ చైర్మన్ శారదా నేరెళ్ల సోషల్ మీడియా ద్వారా తెలియపరిచారు.

కొన్ని రోజుల క్రితం మహిళా కమిషన్ తనని విచారించడానికి వీలు లేదని వేణుస్వామి హైకోర్ట్ లో వేసిన పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది. మహిళా కమిషన్ కి వేణు స్వామిని విచారించడానికి పూర్తి అధికారాలున్నాయని, వారం రోజుల్లో వేణు స్వామి పై తదుపరి చర్యలు తీసుకోవాలని కూడా కమిషన్ ని కోర్టు ఆదేశించింది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.