English | Telugu

వరుణ్ నాగబాబుకు రోల్స్ రాయిస్ కార్ గిఫ్ట్ ఇచ్చాడా..?

మెగాస్టార్ చిరంజీవికి కార్స్ అంటే ప్రత్యేకమైన ఇంట్రస్ట్. అందుకే రెండేళ్ల క్రితం ఆయన బర్త్ డే కు రామ్ చరణ్ రోల్స్ రాయిస్ కారును గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ గిఫ్ట్ రాక ముందే చిరు వద్ద చాలా కార్లున్నాయనుకోండి. అది వేరే విషయం. అయితే రామ్ చరణ్ స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్ ను మరో మెగా హీరో కంటిన్యూ చేస్తున్నాడని సమాచారం. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా తండ్రి నాగబాబుకు ఒక రోల్స్ రాయిస్ ను గిఫ్ట్ గా ఇచ్చాడనే వార్త ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. ఇప్పటికే కెరీర్లో కంచె లాంటి సినిమాతో పేరు తెచ్చుకున్న వరుణ్, శ్రీను వైట్ల సినిమాతో పాటు మరో స్టార్ ప్రొడ్యూసర్ సినిమాకు సైన్ చేసి మంచి ఊపు మీదున్నాడు. ప్రస్తుతం తనకంటూ రెమ్యునరేషన్ సెపరేట్ గా తీసుకుంటున్న వరుణ్, తనకొచ్చిన ఫస్ట్ రెమ్యూనరేషన్ తో డాడీకి కారు కొన్నాడని సినీజనాలంటున్నారు. ఇప్పటికే బుక్ చేసిన కార్, రెండు మూడు రోజుల్లో నాగబాబును చేరుతుందట. కొడుకు నుంచి గిఫ్ట్ తీసుకునే సమయంలో మాత్రం నాగబాబు పుత్రోత్సాహాన్ని అనుభూతి చెందుతారనడంలో సందేహం లేదు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.