English | Telugu

స్వాతంత్ర దినోత్సవం రోజున 'కంచె' టీజర్

మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘కంచె ‘. బాలీవుడ్ లో ఇటివలే గబ్బర్ చిత్రం తో మంచి విజయాన్ని సాధించిన అభిరుచి గల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది.

ఈ చిత్రం మొదటి టీజర్ ను ఆగష్టు 15 న స్వాతంత్ర దినోత్సవ సందర్భం గా విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధ పడుతోంది. ఈ విషయాన్నీ తెలుపుతూ, ఈ చిత్రం మొదటి పోస్టర్ ను హీరో వరుణ్ తేజ్ ఈ రోజు తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా విడుదల చేసారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ డేట్ , మరియి ఇతర వివరాలు త్వరలోనే తెలుపబడతాయి.

కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కూడా ఉండొచ్చు, ఉంటాయి. ఈ నేపధ్యం లో, 1940 ల లో సాగే ఒక కథ ను దర్శకుడు క్రిష్ పూర్తి కమర్షియల్ హంగులతో, తన మార్కు విలువలను జోడిస్తూ తెరకెక్కించారు.

భారీ వ్యవయం తో, అత్యుత్తమ సాంకేతిక విలువల తో రూపుదిద్దుకుంటున్నఈ కంచె, తెలుగు సినిమా ప్రతిష్ట ను పెంచే చిత్రం అవుతుంది అనటం లో ఎటువంటి సందేహం లేదు. ‘కంచె’ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు . ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .